Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏబీఎన్ ఎఫెక్ట్.. పెన్షన్ల పంపిణీలో అక్రమాలకు చెక్

విజయనగరం: జిల్లాలో చేతివాటం ప్రదర్శించిన వాలంటీర్లకు కలెక్టర్ చెక్ పెట్టారు. పెన్షన్ల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో కొరడా ఝులిపించారు. ఓ గ్రామ సచివాలయ నిర్వాహకంపై ఏబీఎన్‌లో కథనాలు రావడంతో కలెక్టర్ చర్యలు చేపట్టారు. డిజిటల్ అసిస్టెంట్, నలుగురు వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు. భరోసా పథకం కింద వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న పెన్షన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి.. గరివిడి మండలం, బొండపల్లిలో సచివాలయ డిజిటల్ అసిస్టెంట్, నలుగురు గ్రామ వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అక్రమాలకు పాల్పడినందుకు వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామన్నారు.

Advertisement
Advertisement