విజయనగరం: పైడితల్లి అమ్మవారి ఉత్సవ నిర్వహణపై అనువంశక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని వ్యాఖ్యానించారు. ధర్మం తగ్గిందని... అహం పెరిగిందన్నారు. జనం లేని జాతర చూడటం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకొక్క మతంపై ఒకొక్క విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. తమ వంశాచారం అనుసరించి మొక్కుబడులు చెల్లించుకున్నామని అశోక్ గజపతిరాజు తెలిపారు.