Vijayanagaram: కల్తీసారా చావులపై కదంతొక్కిన తెలుగు తమ్ముళ్లు

ABN , First Publish Date - 2022-03-19T18:11:28+05:30 IST

ప్రభుత్వ మద్యం విధానం, కల్తీ సారా చావులపై తెలుగు తమ్ముళ్లు కదంతొక్కారు.

Vijayanagaram: కల్తీసారా చావులపై కదంతొక్కిన తెలుగు తమ్ముళ్లు

విజయనగరం: ప్రభుత్వ మద్యం విధానం, కల్తీ సారా చావులపై తెలుగు తమ్ముళ్లు కదంతొక్కారు. జిల్లాలోని పలు మండలాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే టీడీపీ నేతల ఆందోళనలకు పలు చోట్ల ఆంక్షలు, అడ్డగింతలు ఎదురయ్యాయి. ర్యాలీగా వెళుతున్న మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు, ఎమ్మెల్సీ జగదీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు గజపతినగరం నియోజకవర్గ పరిధిలో టీడీపీ శ్రేణులు పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గజపతినగరం మండల టీడీపీ శ్రేణులు అట్టడా లక్ష్యాము నాయుడు, కనకల మురళి, మద్దిల జగన్నాధం తదితరులు నిరసనలో పాల్గొన్నారు.

Updated Date - 2022-03-19T18:11:28+05:30 IST