Abn logo
Jan 16 2021 @ 00:36AM

‘చిత్ర -ఎక్స్‌ మంచి పేరు తెచ్చింది


నటుడు రాజ్‌బాల

రాచర్ల, జనవరి 15 : ఈ ఏడాది జనవరి 1న విడుదలైన చిత్రం-ఎక్స్‌ మంచి విజయాన్ని అందించిందని ఆ సినిమా హీరో రాజ్‌బాల అన్నారు. సంక్రాంతి పండుగకు హీరో రాజ్‌బాలతన స్వగ్రామమైన యడవల్లికి వచ్చారు. ఈసందర్భంగా ఆయన చిత్రపరిశ్రమ గురించి పలువిషయాలను వెల్లడించారు. సినిమాల పట్ల ఆసక్తితో తాను యడవల్లి గ్రామం నుంచి హైదరాబాద్‌కు వెళ్లానన్నారు. తన మొదటి సినిమా లవ్‌భూమ్‌ మంచి విజయాన్ని అందించిందని, ఆ తరువాత 7టు4, మైత్రివనం, అంతకుమించి చిత్రాలలో నటించానని, ఈ ఏడాదిలో చిత్రం-ఎక్స్‌ మంచి పేరు తెచ్చిందని తెలిపారు. త్వరలోనే మిస్టర్‌ క్యూ, తొంగితొంగి చూడమాకు చందమామ  చిత్రాలు విడుదల కానున్నాయన్నారు. ఆర్‌ఎక్స్‌ చిత్రం హీరోయిన్‌ పాయల్‌రాజ్‌పుత్‌తో 5డబ్ల్యూఎస్‌ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. ఇది కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని యడ్లపాడు గ్రామానికి చెందిన సినీ నిర్మాత పొలం గోవిందయ్య చిత్రపరిశ్రమలో తాను హీరోగా ఎదగడానికి ఎంతో కృషి చేశారన్నారు. ప్రతి సంక్రాంతి పండుగకు తప్పకుండా తన స్వగ్రామమైన  యడవల్లి గ్రామానికి వచ్చి తల్లిదండ్రులు, గ్రామస్తులతో సంక్రాంతి పండుగను జరుపుకుంటానని తెలిపారు. రాజ్‌బాల వెంట నారాయణస్వామి, రాము, రమే్‌షరెడ్డి, బొర్రా రాజశేఖర్‌, అల్లావలి ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement