విద్యార్థినులకు బహుమతులను అందజేస్తున్న రోటరీక్లబ్ సభ్యులు
గూడూరు, జనవరి 25: స్థానిక రోటరీ భవన్‌లో మంగళవారం రోటరీక్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థినుల్లో దాగి ఉన్న నైపుణ్యా లను వెలికితీసేందుకు ముగ్గుల పోటీలు దోహదపడు తాయన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను అంద జేశారు. కార్యక్రమంలో నందిమండలం బాలకృష్ణమరాజు, మునిగిరీష్, దశరథరామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, చంద్రమోహన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.