నేడు విద్యా దీవెన నిధులు విడుదల

ABN , First Publish Date - 2022-08-11T06:47:24+05:30 IST

జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి గురువారం నిధులు జమ కానున్నాయి.

నేడు విద్యా దీవెన నిధులు విడుదల

జిల్లాలో 47,822 మంది విద్యార్థులు 

రూ.32.34 కోట్లు విడుదల

విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి గురువారం నిధులు జమ కానున్నాయి. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగో విడత మొత్తాన్ని  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా జిల్లాలోని 47,822 మంది విద్యార్థులకు చెందిన తల్లుల ఖాతాల్లో రూ.32,34,64,443 జమ కానున్నాయి. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 34,813 మంది విద్యార్థులకు రూ.23,31,95,501, ఈబీసీ విద్యార్థులు 4,867 మందికి రూ.3,41,88,254, కాపు విద్యార్థులు 1,547 మందికి రూ.1,23,34,011, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని 4,838 మంది విద్యార్థులకు రూ.3,17,35,817, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలోని 196 మంది విద్యార్థులకు రూ.13,85,090, మైనార్టీ సంక్షేమ శాఖ పరిధి క్రిస్టియన్‌ మైనారిటీకి చెందిన 235 మంది విద్యార్థులకు రూ.19,11,235, ముస్లిం మైనారిటీకి చెందిన 1,326 మంది విద్యార్థులకు రూ.87,70,535 ఖాతాల్లో జమ కానున్నాయి. ఇంటర్‌ తరువాత ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు ఈ మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తోంది. కాగా నగరంలోని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో గురువారం నిర్వహించనున్న విద్యా దీవెన కార్యక్రమంలో కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున పాల్గొంటారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-08-11T06:47:24+05:30 IST