సాయం...దుమారం !

ABN , First Publish Date - 2020-04-10T06:16:42+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రభు త్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేదలకు

సాయం...దుమారం !

పేదలకు రేషన్‌ బియ్యం పంపిణీ చేసిన వైసీపీ నాయకులు

సామాజిక మాధ్యమాల్లో వీడియోలు

అధికారులకు జనసేన ఫిర్యాదు

విచారణ చేపట్టిన పోలీసులు 

స్టేషన్‌లో ఎస్‌ఐ, డీలర్‌ మధ్య వాగ్వివాదం


అద్దంకి, ఏప్రిల్‌ 9: కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రభు త్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పలువురు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేదలకు బియ్యం, ని త్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. అయితే అ ద్దంకి ప్రాంతంలోని కొందరు వైసీపీ నాయకులు తమ వంతు సాయం చేస్తున్నామంటూ రేషన్‌ డీలర్ల వద్ద సేకరించిన బియ్యం పేదలకు పంపిణీ చేయటం దు మారం రేగింది.


వారం రోజుల క్రితం కొంతమంది వైసీపీ నాయకులు పలు రేషన్‌షాపుల డీలర్లకు ఫోన్‌ చేసి రేషన్‌ బియ్యం ఇచ్చి సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో పలువురు డీలర్లు రేషన్‌బియాన్ని ఎఫ్‌సీఐ గోదాము నుంచి సరఫరా చేసిన బస్తాలతో నేరుగా ఇచ్చారు. అయితే కనీసం బియ్యం బస్తాలు కూడా మార్చకుండా ప్రభుత్వం నుంచి వచ్చిన బస్తాలతో బి య్యాన్ని పేదలకు పంచేందుకు  కాలనీలకు తరలించా రు. ఇందుకు సంబంధించి పంపిణీ చేస్తున్నట్లు ఫొటో లు, వీడియోలు తీసి స్వయంగా సామాజిక మాధ్య మాల్లో అప్‌లోడ్‌ చేశారు. వాటిని పరిశీలించిన  పలు వురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు రేషన్‌ బియ్యం పంపిణీ చేసినట్లు గుర్తించి అధికారులకు ఫి ర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఒంగోలు ఆర్డీవో దృ ష్టికి కూడా తీసుకుపోయినట్లు తెలుస్తోంది.


అదే సమ యంలో బుధవారం అద్దంకి తహసీల్దార్‌ సీతారామ య్యను జనసేన నాయకులు గోరంట్ల సాయిప్రకాష్‌, మరికొంత మంది కలిసి వైసీపీ నాయకులు రేషన్‌ బియ్యాన్ని లాక్‌డౌన్‌ సాయం పేరుతో పంచుతున్న వి షయాన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశారు. పేదలకు పం పిణీ చేసిన రేషన్‌ బియ్యం ఏ రేషన్‌ షాపు నుంచి బ యటకు వచ్చాయో విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. రేషన్‌బియ్యం పంపిణీ ఇప్పటికే పూర్తయినం దున పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఎస్‌ఐ మ హేష్‌కు, తహసీల్దార్‌ తెలిపారు. దీంతో రంగంలోకి ది గిన ఎస్‌ఐ బియ్యం పంపిణీ చేసిన ఇద్దరు వైసీపీ నా యకులను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడినట్లు సమా చారం. అదే సమయంలో ఓ రేషన్‌ షాపు  డీలర్‌కు  గురువారం ఉదయం ఫోన్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు రా వాలని చెప్పారు. సదరు డీలర్‌ వెంటనే పోలీస్‌ స్టేష న్‌కు రాకుండా ఒకింత ఆలస్యంగా వచ్చాడు.


దీంతో ఆగ్రహంతో ఉన్న ఎస్‌ఐ సదరు డీలర్‌పై కోపోద్రేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. పంపిణీ చేసిన బియ్యంతో తనకు సంబంధం లేకపోయినా ఎందుకు పిలిపించార న్న ఉద్దేశ్యంతో ఆ డీలర్‌ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గ కుండా సమాధానం చెప్పినట్లు వినికిడి. ఈ సందర్భం గా ఇరువురు మధ్య వాదోపవాదనలు కూడా జరిగిన ట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎస్‌ఐతో పాటు సి బ్బంది కూడా తమదైన శైలిలో సదరు డీలర్‌ను స్టేష న్‌లోకి తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. దీంతో అసలు రేషన్‌బియ్యం పంపిణీ  వ్యవహారం పక్కకు పోయి పో లీస్‌స్టేషన్‌లో జరిగిన సంఘటన అద్దంకి పట్టణంలో హాట్‌హాట్‌గా మారింది.  


Updated Date - 2020-04-10T06:16:42+05:30 IST