Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 29 Jun 2022 17:57:09 IST

Viral Video: ఈ పిల్ల ఏనుగుకు అతనంటే ఎంత ప్రేమ.. కీపర్‌ను చూడగానే ఏం చేసిందో చూడండి..

twitter-iconwatsapp-iconfb-icon
Viral Video: ఈ పిల్ల ఏనుగుకు అతనంటే ఎంత ప్రేమ.. కీపర్‌ను చూడగానే ఏం చేసిందో చూడండి..

జంతువులకు, జంతువులకు మధ్య.. మనుషులకు, మనుషులకు మధ్య ప్రేమానురాగాలు ఉండడం సహజమే. కానీ ఒక్కోసారి కొన్ని జంతువులు మనుషులపై కూడా ఎంతో ప్రేమను పెంచుకుంటాయి. కొన్ని జంతువులైతే.. సాటి జంతువుల కంటే మనుషుల పైనే మమకారం చూపిస్తుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. ఓ జూలో కీపర్‌గా ఉన్న వ్యక్తిపై ఓ పిల్ల ఏనుగు ఎంతో ప్రేమ పెంచుకుంది. అతడి పట్ల ఏనుగు చూపించిన ప్రేమను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

కెన్యాలోని ఓ జూలో జోసెఫ్ అనే వ్యక్తి కీపర్‌గా ఉన్నాడు. ఇతను జంతువులను ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉంటాడు. దీంతో చాలా జంతువులు అతడి పట్ల ప్రేమను కనబరుస్తూ ఉంటాయి. అయితే ఓ పిల్ల ఏనుగుకు మాత్రం జోసెఫ్ అంటే ఎనలేని ప్రేమ. అతడిని చూడగానే వేగంగా దగ్గరికి వెళ్లి.. అమాంతం అతన్ని కౌగిలించుకుంటుంది. అతడు ఏనుగు తలపై చేయితో నిమురుతూ ఆప్యాయంగా పలకరిస్తాడు. ఏనుగు అక్కడి నుంచి వెళ్లకుండా  చాలా సేపు వరకూ అతడి వద్దే పడుకుంటుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. జోసెఫ్ వంటి కీపర్లు ఉంటే జంతువులన్నీ ఆనందంగా ఉంటాయని కొందరు కామెంట్ చేస్తుంటే.. పిల్ల ఏనుగు, కీపర్ మధ్య అనుబంధం చూస్తుంటే.. ఎంతో ముచ్చటేస్తోంది.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

నడిరోడ్డుపై Dangerous Stunts తో ఓ కుర్రాడి పిచ్చి చేష్టలు.. బైక్‌పై వెళ్తూ సడన్‌గా సీట్‌పై నుంచి పక్కకు దిగి మరీ..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

Viral Video: విమానం నుంచి సరస్సుల్లోకి దూకుతున్న చేపలు... ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. videoViral Video: వామ్మో! ఈ బామ్మకు ఏం ధైర్యం.. అంతెత్తు నుంచి అమాంతం దూకేసింది.. ఆశ్యర్యపోతున్న నెటిజన్లు..videoకొన్ని నెలల అనంతరం భార్యను చూసేందుకు ఇంటికొచ్చిన భర్త.. తన విషయం బయట చెబితే చంపేస్తానన్న భార్య.. చివరకు ఏం చేసిందంటే.. వేకువజామున అలికిడి రావడంతో పక్క గదిలోకి వెళ్లిన తల్లి.. లోపల ప్రియుడితో కలిసి అసభ్యకర రీతిలో ఉన్న కూతురిని చూసి.. Viral Video: వావ్! ఈ seal పూలు అందించి.. ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయగానే.. ప్రియురాలి రియాక్షన్ చూడండి..videoరైల్వే స్టేషన్‌లో కంగారుగా కనిపించిన ఓ బాలిక, ఓ కుర్రాడు.. అనుమానంతో ఆరా తీసిన పోలీసులు.. అసలు నిజం తెలిసి..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.