Shaktiman Stunt: కదులుతున్న ట్రక్ మీద పుష్ అప్స్... చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-07-21T01:02:50+05:30 IST

కొంత మంది పిల్లలు, యువకులు సినిమాలు చూసి వాటిల్లో హీరోల్లా ప్రవర్తించాలనుకుంటారు.

Shaktiman Stunt: కదులుతున్న ట్రక్ మీద పుష్ అప్స్... చివరకు ఏం జరిగిందంటే..

కొంత మంది పిల్లలు, యువకులు సినిమాలు చూసి వాటిల్లో హీరోల్లా ప్రవర్తించాలనుకుంటారు. తమను తాము హీరోలుగా భావిస్తూ ప్రమాదకర స్టంట్‌లు చేస్తుంటారు. తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా ఇలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar pradesh)లో ఈ షాకింగ్ ఘటన జరిగింది.




లక్నోలోని గోమతి నగర్‌లో ఒక బాలుడు ట్రక్ మీదకు ఎక్కాడు. వేగంగా వెళ్తున్న ట్రక్ టాప్ మీద నిలబడి నేనే శక్తిమాన్ అంటూ రకరకాల విన్యాసాలు చేశాడు. అక్కడే పుష్ అప్స్ కూడా చేశాడు. ట్రక్ వేగంగా వెళ్తుండడంతో చివరకు బ్యాలెన్స్ తప్పి కిందపడ్డాడు. గాయాల పాలైన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్ల తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 



Updated Date - 2022-07-21T01:02:50+05:30 IST