Viral Video: వామ్మో.. ఎంత ధైర్యం.. ఆకాశంలో విమానం నుంచి వేలాడుతూ వర్కౌట్‌.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-08-21T02:11:26+05:30 IST

చాలా కొద్ది మంది సాహసోపేతమైన ఆటలు ఆడేందుకు ఇష్టపడుతుంటారు.

Viral Video: వామ్మో.. ఎంత ధైర్యం.. ఆకాశంలో విమానం నుంచి వేలాడుతూ వర్కౌట్‌.. వైరల్ అవుతున్న వీడియో!

చాలా కొద్ది మంది సాహసోపేతమైన ఆటలు ఆడేందుకు ఇష్టపడుతుంటారు. వారిలో మహిళల సంఖ్య మరింత తక్కువగా ఉంటుంది. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో మహిళ ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసింది. విమానం నుంచి వేలాడుతూ వర్కవుట్ చేసింది. ఆ మహిళ ధైర్యానికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)అవుతోంది. 


కేటీ వాసెనినా అనే మహిళ స్కై డైవింగ్ (sky diving) చేయడానికి సిద్ధమైంది. భూమికి కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఆకాశంలో ఉండగా ఆమె విమానం నుంచి వేలాడుతూ వర్కవుట్ చేసింది. అనంతరం అక్కడి నుంచి కిందకు దూకేసింది. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. `పొట్ట కండరాల వ్యాయామం చేయడానికి ఏకైక మార్గం` అని ఆమె కామెంట్ చేసింది. ఆ వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. కేటీ సాహసంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 


Updated Date - 2022-08-21T02:11:26+05:30 IST