Viral Video: ప్రేయసికి ప్రపోజ్ చేస్తున్న సమయంలో అనుకోని సంఘటన.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-08-22T02:10:32+05:30 IST

మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న వ్యక్తికి తన మనసులో మాట చెప్పడం అనేది ఎవరికైనా చాలా టెన్షన్‌తో కూడుకున్న పని

Viral Video: ప్రేయసికి ప్రపోజ్ చేస్తున్న సమయంలో అనుకోని సంఘటన.. చివరకు ఏం జరిగిందంటే..

మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న వ్యక్తికి తన మనసులో మాట చెప్పడం అనేది ఎవరికైనా చాలా టెన్షన్‌తో కూడుకున్న పని. ప్రేమ ప్రపోజ్ చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు చాలా సాదాసీదాగా `ఐ లవ్యూ` చెబితే.. మరికొందరు జీవితాంతం గుర్తుండిపోయేలా వినూత్న ప్రయోగాలు చేస్తారు. ఓ అథ్లెట్ అలాంటి ప్రయోగమే చేయాలనుకున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్‌కు స్టేడియంలోనే ప్రపోజ్ (Love proposal) చేయాలనుకున్నాడు. 




ఉత్తర యూరప్‌లో ఉన్న ఇస్తోనియా (Estonia) దేశానికి చెందిన క్రిస్టియన్ అనే అథ్లెట్ ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్‌లో పాల్గొన్నాడు. పోటీ అనంతరం నేరుగా తన గాళ్‌ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి ప్రపోజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అనుకున్నట్టుగానే ఆమె ముందు మోకాళ్లపై కూర్చుని రింగ్ తీశాడు. అయితే ఇంతలోనే అతని కాలి కండరాలు పట్టేయడంతో ప్రియురాలి ఎదుట కుప్పకూలిపోయాడు. అతనికి ఏమి జరిగిందో తెలియక అతని ప్రేయసి కంగారు పడింది. చివరకు ఇద్దరు వ్యక్తుల సహాయంతో క్రిస్టియన్ తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. 


నిల్చునే శక్తి లేకపోవడంతో పడుకునే ప్రపోజ్ చేశాడు. అతని ప్రేమను గాళ్‌ఫ్రెండ్ యాక్సెప్ట్ చేసింది. అందరి ముందు `యస్` చెప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా ఇప్పటికి 39 లక్షల మంది చూశారు. 1.9 లక్షల మంది లైక్ చేశారు. 

Updated Date - 2022-08-22T02:10:32+05:30 IST