Viral Video: ట్రక్‌ను పైకి ఎత్తబోయి బ్రిడ్జి మీద నుంచి పడిపోయిన క్రేన్.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-08-05T22:42:52+05:30 IST

బ్రిడ్జి మీద నుంచి చెరువులో పడిపోయిన ట్రక్‌ను పైకి లేపడానికి వెళ్లిన క్రేన్ (Crane Falls ) కూడా ప్రమాదానికి గురైంది

Viral Video: ట్రక్‌ను పైకి ఎత్తబోయి బ్రిడ్జి మీద నుంచి పడిపోయిన క్రేన్.. వీడియో వైరల్

బ్రిడ్జి మీద నుంచి చెరువులో పడిపోయిన ట్రక్‌ను పైకి లేపడానికి వెళ్లిన క్రేన్ (Crane Falls ) కూడా ప్రమాదానికి గురైంది. రెండు క్రేన్‌లకు కట్టిన కేబుల్ తెగిపోవడంతో ఒక క్రేన్ గాల్లో పైకి లేచి నీటిలో పడిపోయింది. ఈ ఘటన ఒడిశా (Odisha ) లోని తాల్చేర్ పట్టణంలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. 


తాల్చేర్ పట్టణంలో ఒక ట్రక్ బ్రిడ్జ్ మీద నుంచి కింద పడిపోయింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు రెండు క్రేన్‌లను అక్కడికి తీసుకొచ్చారు. నీటిలో పడిపోయిన ట్రక్‌కు తాడు కట్టి దానిని రెండు క్రేన్‌లతో పైకి లాగడానికి ప్రయత్నాలు చేశారు. రెండు క్రేన్‌లు ట్రక్‌ను ఒక్కసారిగా పైకి లాగడానికి ప్రయత్నించడంతో షాకింగ్ ఘటన జరిగింది. తాడు తెగిపోవడంతో బరువంతా ఒక క్రేన్ మీద పడింది. దీంతో గాల్లోకి లేచిన క్రేన్ అదే ట్రక్ మీద పడిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



Updated Date - 2022-08-05T22:42:52+05:30 IST