చదువుకు కొవిడ్‌ అడ్డంకి రాకుండా వీడియో పాఠాలు

ABN , First Publish Date - 2020-08-07T11:34:15+05:30 IST

కొవిడ్‌-19 వైరస్‌ వల్ల ఇప్పట్లో పాఠశాలలు తెరిచే పరిస్థితి కనిపించడం లేదు.

చదువుకు కొవిడ్‌ అడ్డంకి రాకుండా వీడియో పాఠాలు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా వారధి, విద్యామృతం 

ఏజెన్సీ, బలహీన వర్గాల ప్రాంతాల విద్యార్థులకు  ప్రాధాన్యం

జిల్లాకు వచ్చిన విద్యా  వారధి సంచార వాహనం 


కాకినాడ (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌-19 వైరస్‌ వల్ల ఇప్పట్లో పాఠశాలలు తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. వేసవి సెలవులన్నీ కొవిడ్‌ ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. వచ్చిన సెలవుల్లో పిల్లలంతా ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. సెలవుల తర్వాత పాఠశాలలకు వెళ్దామని రెడీ అయినా కరోనా వెంటాడుతూనే ఉంది. ఈ పరిస్థితిలో జిల్లా విద్యా శాఖ  ప్రభుత్వ ఉపాధ్యాయులకు డ్యూటీలు వేసింది. ఒక్కో ఉపాధ్యాయుడు సబ్జక్టు, తరగతి వారీ పిల్లలకు సిలబస్‌ పరిచయం చేస్తూ, మొబైల్‌ ఫోన్ల ద్వారా విద్యార్థులకు పాఠాలు చెబుతు న్నారు. అభ్యాసన ప్రక్రియ మరిచిపోకుండా విద్యార్థులకు ప్రతీ రోజూ రెండు గంటలు ఆయా సబ్జక్టులపై అవగాహన కల్పిస్తున్నారు. ఇదే సమయంలో ఏజెన్సీ, బలహీన వర్గా లుండే శివారు ప్రాంతాల్లో విద్యార్థుల చెంతకు వెళ్లి సమీపంలో వారికి వీడియోల ద్వారా పాఠాలు చెప్పడానికి విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సాంకేతిక అందు బాటులో లేని విద్యార్థుల కోసం (1-5 తరగతుల పిల్లలు) విద్యా వారధి, 6-10 విద్యా ర్థులకు విద్యామృతం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని విద్యాశాఖ రూపొందించింది.


ఈ మేరకు సాంకేతిక పరికరాలతో కూడిన ఒక సంచార వాహనం ఇటీవల డీఈవో కార్యా లయానికి వచ్చింది. ఇప్పటివరకు సాంకేతికత అందుబాటులో ఉన్న ప్రాంత విద్యార్థు లకు కరోనా దృష్ట్యా దూరదర్శన్‌, ఇతర ఆన్‌లైన్‌ పద్ధతుల ద్వారా ఉపాధ్యాయులు పాఠాలు చెప్పారు. టెక్నాలజీ అందుబాటులో లేని విద్యార్థులు చదువుకు దూరమ య్యారు. తోటి విద్యార్థులతో వీరు వెనకపడకుండా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. సరికొత్త ప్రయోగానికి మార్గం సుగమం చేసింది. ఈ కొత్త ప్రణాళిక అమలు చేయ డానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఎంత మందికి ఆన్‌లైన్‌ పాఠాలు అందడం లేదు. దీనికి కారణాలపై ఉపాధ్యాయులతో సర్వే చేయించారు. ఈ క్రమంలో ఏపీలో 1.25 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నారని తేలింది. ఇందులో జిల్లాకు సంబంధించి 12 వేల మంది విద్యార్థులున్నారు. ఇప్పుడు వీరికి విద్యావారధి సంచార వాహనం ద్వారా పాఠాలు అందించాలని కసరత్తు చేస్తున్నారు.


ఇందుకు స్టేట్‌ కౌన్సెల్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ ట్రైనింగ్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) అమ రావతి నుంచి జిల్లాలో ఈ అంశాలను ఒక కో ఆర్డినేటర్‌ పర్యవేక్షిస్తారు. ఏజెన్సీ, తీర ప్రాంతాల రిమోట్‌ ప్రదేశాలకు ప్రతీ రోజూ విద్యావారధి సంచార వాహనం వెళ్తుంది. ఈ మేరకు ఏజెన్సీలో 5 మండలాల్లో గిరిజన ప్రాంతాలు, ప్లెయిన్‌ ఏరియాలో కోనసీమ పరిధిలో మత్య్సకార తీర ప్రాంతా లున్న ఏడు మండలాల్లో శివారు ప్రాంతాలకు కేటాయించిన రోజున ఈ వాహనం వెళ్తుంది. వాహనంలో విద్య ఇ- కంటెంట్‌, ఎల్‌ఈడీ టీవీ తెర ఉంటుంది. డిజిటల్‌ సౌకర్యం లేని ప్రాంతాల్లో మాత్రమే ఈ వాహ నం పర్యటిస్తుంది. అక్కడ విద్యార్థు లకు పాఠాలు చెప్పడానికి సబ్జక్టు ఉపాధ్యాయులుంటారు. అయితే పాఠాలు చెప్పే క్రమంలో మండల విద్యాశాఖాదికారులకు బాధ్యతలప్ప గిస్తున్నారు. వీరు ఆయా ప్రాంతాల్లో ఉన్న పిల్లల వయస్సును పరిగణ లోకి తీసుకుని వారికి ఎల్‌ఈడీ తెరపై పాఠాలు చెబుతారు.  దీనిపై డీఈవో ఎస్‌ అబ్రహం మాట్లాడుతూ కొవిడ్‌ ఉధృతి తగ్గుముఖం పడితేనే గాని పాఠశాలలు తెరిచే అవకాశాలు లేవని,  ప్రస్తుతం విద్యావారధి చేప ట్టాం. పాఠ్యాంశాల్లో సంసి ద్ధులను చేయడానికి యాక్షన్‌ప్లాన్‌తో ముందు కు వెళ్తున్నామన్నారు.

Updated Date - 2020-08-07T11:34:15+05:30 IST