Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 30 Dec 2021 20:38:38 IST

ఇనుప రాడ్ కోసం బావిలో వెతకగా.. బంగారు మూట దొరికింది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

twitter-iconwatsapp-iconfb-icon

ఒక్కోసారి కొన్ని పనులు.. ఏ శ్రమ లేకుండానే చకచకా జరిగిపోతుంటాయి. అలాగే భారీ చోరీలు జరిగినప్పుడు ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా ఆధారాలు దొరకవు. అలాంటి కేసులు.. అటు బాధితులతో పాటూ ఇటు పోలీసులకు కూడా పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. తమిళనాడులో ఓ కేసు ఎలాంటి కష్టం లేకుండానే పరిష్కారమైంది. దీంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

తమిళనాడు పుదుక్కోట్టై జిల్లా గోపాలపట్నం గ్రామంలో జవహర్ సాధిక్ అనే వ్యక్తి ఇంట్లో సోమవారం భారీ చోరీ జరిగింది. దొంగలు తలుపులను పగులగొట్టి లోపలికి చొరబడి 687 సవర్ల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు చోరీ జరిగిందని తెలుసుకున్న బాధితులు.. లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం డీఐజీ కూడా బాధితుడి ఇంటిని సందర్శించారు. దీంతో ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. అయితే నిందితులకు సంబంధించిన ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో పోలీసులు బాధితులకు ఓ సలహా ఇచ్చారు.

చదువు చెప్పాల్సిన ప్రిన్సిపాల్.. బాలికలతో ఏం చేయించిస్తున్నారో తెలుసా.. చివరకు ఈ విషయం ఎంతవరకు వెళ్లిందంటే..

తలుపులు బద్దలు కొట్టేందుకు దొంగలు ఉపయోగించిన ఇనుప రాడ్డు దొరికితే కేసును సులభంగా ఛేదించవచ్చని సూచించారు. దీంతో ఆ రాడ్డు కోసం బాధితులు కూడా వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు ఓ బావిలో వెతికారు. ఇందుకోసం బావిలోని నీటినంతా బయటికి తోడారు. చివరగా వారికి ప్లాస్టిక్ కవర్ మూట కనిపించింది. దాన్ని బయటికి తీసుకొచ్చి తెరచిచూడగా.. ఆశ్చర్యంగా తమ నగలన్నీ అందులో ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. చోరీకి గురైన నగలన్నీ ఎట్టకేలకు దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. తమ నగలన్నీ దొరకడంతో బాధితులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

మండపంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చిన వధువు.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన పాకిస్తానీ పెళ్లికూతురు..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు.. భర్తతో విడిపోయి ఒంటిరి జీవితం.. చివరగా జిమ్ ట్రైనర్ పరిచయంతో..ప్రియురాలి కోసం అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లిన ప్రియుడు.. వెనుకే వెళ్లిన యువతి తండ్రి.. చివరికి అనుకోని విధంగా.. తల్లిపాలతో ఆభరణాల తయారీ.. మహిళల నుంచి వెల్లువెత్తుతున్న ఆర్డర్లు.. ఎక్కడో తెలుసా..videoముహూర్తాలు లేవని ఫిబ్రవరి 21న పెళ్లి ఫిక్స్.. కానీ వరుడితో విసిగి ఈ యువతి నిర్ణయమిదీ..!పెళ్లి మండపంపై సిద్ధంగా ఉన్న వధువు.. ఇక వరుడు రావడమే ఆలస్యం... అయితే అందుకు విరుద్ధంగా..సీరియస్‌గా సీరియల్ చూస్తున్న కుటుంబం.. ఇంతలో పైఅంతస్తు నుంచి శబ్ధాలు.. కంగారుగా పరుగెత్తుకుంటూ పైకెళ్లి చూస్తే..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.