క్విట్‌ ఇండియా స్పూర్తితో స్వరాజ్యం నుంచి ఏకీకృత సురాజ్యం దిశగా

ABN , First Publish Date - 2020-08-09T20:50:33+05:30 IST

స్వరాజ్య సముపార్జన కోసం ప్రారంభమైన క్విట్‌ ఇండియా ఉద్యమం లక్ష్యం అనతి కాలంలోనే నెరవేరినప్పటికీ స్వేచ్చా భారత మిషన్‌లో మనం విజయం సాధించామా? అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

క్విట్‌ ఇండియా స్పూర్తితో స్వరాజ్యం నుంచి ఏకీకృత సురాజ్యం దిశగా

న్యూఢిల్లీ: స్వరాజ్య సముపార్జన కోసం ప్రారంభమైన క్విట్‌ ఇండియా ఉద్యమం లక్ష్యం అనతి కాలంలోనే నెరవేరినప్పటికీ స్వేచ్చా భారత మిషన్‌లో మనం విజయం సాధించామా? అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భారత దేశం ఆధునిక చరిత్రలో ఆగస్టు నెలకు ప్రత్యేకమైన స్దానం ఉంది. ఆగస్టు8 1942 న బ్రిటిష్‌ వారు భారతదేశాన్ని విడిచి వెళ్లాలంటూ ఉద్యమం ప్రారంభమైంది. ఆగస్టు 15, 1947 న వారి పాలన భారతదేశంలో అంతమైంది. శాంతి దూత అయిన మహాత్మాగాంధీ అహింస ద్వారానే స్వరాజ్య సముపార్జన సాధ్యమవుతుందని త్రికరణశుద్ధిగా నమ్మి ఆచరణలోచూపి స్వరాజ్య పోరాటానికి నైతిక బలంతో పాటు ప్రజా బలాన్ని కూడగట్టారు. 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత దేశానికి తిరిగి వచ్చినప్పటి నుంచి ఆయన ఇదే బాటలో ముందుకు సాగారు. సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన మార్గాలను ప్రచారం చేయడం ద్వారా మహాత్ముడు దేశాన్ని ముందుకు నడిపారు. 


శాంతియువత మార్గంలోని గొప్పదనాన్ని తెలియజేస్తూ ఆయన  చెప్పిన న్రపతి మాట, మంత్రమై యావత్‌దేశాన్ని ఉత్తేజితం చేసింది. ఆగస్టు8, 1942న ముంబైలోని గోవాలియా ట్యాంక్‌మైదానం నుంచిచేసిన క్విట్‌ ఇండియా ప్రసంగంలో దేశ స్వేచ్చ కోసం ‘డూ ఆర్‌ డై’ అనే నినాదాన్నిఇచ్చారు. మహాత్ముడు పలికిన ఈ చిన్న వ్యాక్యం దోపిడీ వలసరాజ్య పాలన నుంచి స్వేచ్చకోసం ఆరాటపడతుఊ ఆలస్యం అవుతున్న కొద్దీ అసహనానికి గురౌతున్న దేవ ప్రజల అపోహలను తొలగించింది. భారత స్వాతంత్య్ర  పోరాటా వారధిగా మహాత్ముడు పూరించిన శాంతియుత సమర శంఖం రవి అస్తమించని సామ్రాజ్యమనే భ్రమలో ఉన్న బ్రిటీష్‌ పాలకులకు వెన్నులో వణుకు పుట్టించింది. 


బ్రిటీష్‌ వలస పాలకులు భారతీయుల పట్ల సానుకూలంగా దృక్పధంతో ఉన్నారని, వారేదో ప్రజలు మేలు చేస్తారని నమ్మే నాయకులు పిటీషన్లు, అభ్యర్ధనలు, విజ్ఞప్తుల ద్వారా చాలా కాలం గడుపుతూ వచ్చారు. సరిగ్గా 78 సంవత్సరాల క్రితం ఇదే నెలలో క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభమైన ఐదేళ్లకు భారత దేశం స్వాతంత్య్రం సంపాదించుకుంది. గతం నుంచి సరైన పాఠాలు నేర్చుకుని బలమైన భవిష్యత్తును నిర్మించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తేనే ఏ నాగరికత అయినా ఉన్నత మార్గంలో ముందుకు సాగుతుంది. ఇందు కోసం మనం కొత్త అనుభవ పాఠాలతో సిద్ధంగా కావాలి. ఈసందర్భంగా మనం స్వేచ్చా వాయువులు పీల్చుకునేందుకు సాగించిన పోరాటంలో అమరులైన వారందరికీ నివాళులర్పిస్తున్నట్టు ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 


Updated Date - 2020-08-09T20:50:33+05:30 IST