హైదరాబాద్ సిటీ : ప్రతి ఏడు దసరా తరువాత రోజు ‘దత్తన్న అలయ్ బలయ్’ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు ప్రముఖులు కలుసుకోనున్నారు. దసరా తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం, ఆలింగనం చేసుకోవడం అలయ్ బలయ్ ప్రత్యేకత. ఈసారి అలయ్ బలయ్‌కి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.
తెలంగాణ గవవర్నర్ తమిళ సై, ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అలయ్ బలయ్ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. తెలుగురాష్ట్రాల మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతేకాకుండా సినీ ప్రముఖులు, కవులు కళాకారులు హాజరుకానున్నారు. అలయ్ బలయ్‌లో తెలంగాణ సంసృతి ఉట్టిపడే కళాకారుల నృత్యాలతోపాటు తెలంగాణ చడ్రుచుల వంటకాలు ఇక్కడ ప్రత్యేకం.