మధ్యప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు.. ఆరెంజ్ హెచ్చరిక జారీ

ABN , First Publish Date - 2020-08-13T23:10:34+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాల్లో శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ

మధ్యప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు.. ఆరెంజ్ హెచ్చరిక జారీ

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాల్లో శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని ఐఎండీ భోపాల్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త జీడీ మిశ్రా తెలిపారు. చింద్వారా, బాలాఘాట్, బేతుల్, హర్దా, ఖండ్వా, అలీరాజ్‌పూర్, ఝాబా, ధార్ జిల్లాల్లో శుక్రవారం ఉదయం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వివరించారు. మిగతా 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాల్లో ‘యెల్లో వార్నింగ్’ జారీ చేసినట్టు పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-13T23:10:34+05:30 IST