ఘనంగా వెంగముని ఆరాధనోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-09T05:21:16+05:30 IST

మండలపరిధిలోని తిమ్మనాయునిపాలెం గ్రామంలో వెలసిన వెంగముని స్వామి ఆరాధనోత్సవాలను సోమవారం ఘనం గా నిర్వహించారు.

ఘనంగా వెంగముని ఆరాధనోత్సవాలు
ప్రత్యేక అలంకరణలో వెంగమునిస్వామి


ముదిగుబ్బ, ఆగస్టు 8: మండలపరిధిలోని తిమ్మనాయునిపాలెం గ్రామంలో వెలసిన వెంగముని స్వామి ఆరాధనోత్సవాలను సోమవారం ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా   ఆలయంలోని  స్వామి విగ్రహానికి పూజా రులు భాస్కర్‌రెడ్డి, విజయశేఖర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, గోవర్ధన రెడ్డి పంచామృ తాభిషేకం, గంధం పూజ నిర్వహించారు. వెండి ఆభరణాలు, వెండి గొడుగులు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి పురవీధులలో ఊరేగిం చారు. భక్తులు స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పెద్దబాలముని ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.


Updated Date - 2022-08-09T05:21:16+05:30 IST