వేలూరులో Bjp నిరాహారదీక్ష

ABN , First Publish Date - 2022-07-06T15:03:13+05:30 IST

స్థానిక అన్నా ఆడిటోరియం సమీపంలో మంగళవారం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేపట్టారు. డీఎంకే ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యా

వేలూరులో Bjp నిరాహారదీక్ష

వేలూరు(చెన్నై), జూలై 5: స్థానిక అన్నా ఆడిటోరియం సమీపంలో మంగళవారం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేపట్టారు. డీఎంకే ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు. ఆక్రమంలో, స్థానిక అన్నా ఆడిటోరియం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు మనోహరన్‌ నేతృత్వంలో దీక్ష జరిగింది. ఈ దీక్షలో జిల్లా అధ్యక్షుడు వెంకటేశన్‌, రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ కాత్యాయని, నిర్వాహకులు బాబు, జగన్‌, శరవణన్‌, పిచ్చాండి, ఇళంగోవన్‌ సహా పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T15:03:13+05:30 IST