వెలిగొండ పూర్తితోనే వలసల నివారణ

ABN , First Publish Date - 2022-07-02T06:12:21+05:30 IST

ఈ ప్రాంతం నుంచి పేదప్రజలు వలస కూలీలుగా వెళ్లకుండా నివారించాలంటే వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి నీళ్లు విడుదల చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు.

వెలిగొండ పూర్తితోనే వలసల నివారణ
మాట్లాడుతున్న ఆశోక్‌రెడ్డి

టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం, జూలై 1 : ఈ ప్రాంతం నుంచి పేదప్రజలు వలస కూలీలుగా వెళ్లకుండా నివారించాలంటే వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి నీళ్లు విడుదల చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. ఎర్రగొండపాలెం మండలం  గోళ్ళవీడఫీ గ్రామంలో శుక్రవారం సాయంత్రం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వస్తే రైతులకు 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పిన జగన్‌, ప్రస్తుతం డ్రిప్‌ ఇరిగేషన్‌ రాయితీలను కూడా తొలగించారన్నారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. జడ్పీ మాజీ ఉపాధ్యరక్షుడు డాక్టరు మన్నె రవీంద్ర మాట్లాడుతూ చంద్రబాబే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తారని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. కార్యక్రమంలో  ఏఎంసీ మాజీ చైర్మన్‌ చేకూరి ఆంజనేయులు, టీడీపీ మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు,  టీడీపీ మండల ముఖ్యనాయకులు గోళ్లసుబ్బారావు, తోటమహేష్‌, వడ్లమూడి లింగయ్య, కంచర్ల సత్యనారాయణగౌడ్‌, వేగినాటి శ్రీను, చిట్యాల వెంగళరెడ్డి, ఎం.మంత్రునాయక్‌, షేక్‌ ఇస్మాయిల్‌, చెవుల.అంజయ్య, గోళ్లవీడఫీ మాజీ ఎంపీటీసీ నక్కా వెంకటచెన్నయ్య,  సత్యనారాయణ, కొండలు పాల్గొన్నారు. గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు.

గిద్దలూరు : వైసీపీ ప్రభుత్వం కుడిచేత్తో డబ్బు ఇచ్చినట్లుగా ఇచ్చి ఎడమచేత్తో వివిధ రకాల పన్నుల పేరిట డబ్బు వసూలు చేస్తోందని, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ముత్తుముల అశోక్‌రెడ్డి విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం అర్థవీడు మండల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ నిన్న అమ్మఒడి పేరుతో ప్రజలకు డబ్బులు వేసి నేడు ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి డబ్బు లాక్కుంటున్నాడని ఎద్దేవా చేశాడు.  రానున్న ఎన్నికల్లో  టీడీపీని గెలిపించుకుని చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుంటే తప్ప రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదన్నారు. ఈ సందర్భంగా అర్థవీడు మండల టీడీపీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బండ్లమూడి ఆంజనేయులు యాదవ్‌, ప్రధాన కార్యదర్శిగా కొనతం రంగారెడ్డి, ఉపాధ్యక్షుడిగా సూరె కిట్టయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

టీడీపీలో పలువురు చేరిక

గిద్దలూరు : కంభం గ్రామానికి చెందిన ఎనిమిది కాపు సామాజిక వర్గ కుటుంబాలు గిద్దలూరులో శుక్రవారం  ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో  టీడీపీలో చేరాయి.  చెన్ను రామయ్య, చెన్ను రవికుమార్‌, బండారు వీరరంగయ్య, బండారు నారాయణ, సుంకరి వెంకటేశ్వర్లు, భూపతిరాజు, గోపాల్‌, అరుణ్‌ టీడీపీలో చేరారు. కార్యక్రమంలో కంభం మండల టీడీపీ అద్యక్షుడు తోట శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, టీడీపీ నాయకులు ఎ.ప్రసాద్‌, టి.శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

తర్లుపాడు : మండలంలోని నాగెళ్లముడుపులో భారీగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు వచ్చాయి.  వైకాపాకు కంచుకోటగా ఉన్న నాగెళ్లముడుపులో 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. తిరుమల కనకయ్య, నల్లబోతుల వీరా స్వామి  ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు.  వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించి రైతుల మెడలకు ఉరితాళ్లు బిగిస్తున్నారన్నారు. ప్రస్తుతం నిత్య అవసర వస్తువులు వంట గ్యాస్‌, పెట్రోల్‌, డిజిల్‌, ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతుందన్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తోందన్నారు. పార్టీలో చేరిన వారిలో కొమ్ము కాశయ్య, జడ సుబ్బయ్య, ఊస వెంకటయ్య, నల్లబోతుల అంజయ్య, జడ వెంకటేశ్వర్లు, పూస గురవయ్య, జడ వెంకటయ్య, తిరుమల అశోక్‌తో పాటు మరో 90 కుటుంబాలు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నాయి. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు యు.చిన్నపురెడ్డి, జె.రామాంజనేయరెడ్డి,  టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షులు కె.కాశయ్య, మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్లు సీహెచ్‌.రామలింగయ్య, కాకర్ల శ్రీనివాసులు, మాజీ ఎంపిటిసిలు పి.గోపినాథ్‌ చౌదరి, సాదం వీరయ్య యాదవ్‌, టిడిపి నాయకులు చలమారెడ్డి, టి.రామయ్య, కె.చిట్టిబాబు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-02T06:12:21+05:30 IST