శాకాహారంతో ‘హృదయం’ పదిలం!

ABN , First Publish Date - 2021-06-19T07:40:30+05:30 IST

శాకాహారం గుండెకు మంచిదని, ఇది గుండెపో టు ముప్పును చాలా వరకు తగ్గిస్తుందని ఓ అధ్యయనం వెల్లడించింది. హార్వర్డ్‌ టీహెచ్‌ చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకులు

శాకాహారంతో ‘హృదయం’ పదిలం!

ఆరోగ్యకరమైన ఆహారంతో గుండెకు 10 శాతం ముప్పు తప్పినట్టే

హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అధ్యయనంలో వెల్లడి


వాషింగ్టన్‌, జూన్‌18: శాకాహారం గుండెకు మంచిదని, ఇది గుండెపో టు ముప్పును చాలా వరకు తగ్గిస్తుందని ఓ అధ్యయనం వెల్లడించింది. హార్వర్డ్‌ టీహెచ్‌ చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం.. ఇటీవల న్యూరాలజీ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమైం ది. శాకాహారంతో రక్త సరఫరా మెరుగవుతుందని, ఇది గుండెకు మేలు చేస్తుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. మొక్కల ఆధారిత, మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే వాళ్లలో గుండెపోటు ప్రమాదం త క్కువని, గుండెకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడడం, మెదడులో రక్తస్రావం తదితర సమస్యలు తక్కువగా ఏర్పడుతాయని అధ్యయనం తెలిపింది. 2,09,508 మంది ఆరోగ్య సిబ్బందిపై 25 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు ఈ పరిశోధన సాగింది.


అసలు మాంసాహారం తీసుకోని.. లేదా నెలకు ఒక్కసారి మాత్రమే తీసుకునే వారిని శాకాహారులుగా పరిగణించారు. మిగిలిన వారిని మాంసాహారులుగా వ ర్గీకరించారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వీరి పూర్తి ఆరోగ్య వివరాలను సేకరిస్తూ వచ్చారు. ఈ వివరాలను అధ్యయనం చేసిన తర్వాత పరిశోధకులు ఓ నివేదికను రూపొందించారు. దీని ప్రకారం.. ఈ 25 ఏళ్ల కాలపరిమితిలో.. మొత్తం 6,241 మంది గుండెపోటుకు గురయ్యారు. ఇందులో శాకాహారులు కూడా ఉన్నప్పటికీ.. వారి శాతం తక్కువని అధ్యయనం తెలిపింది.  

Updated Date - 2021-06-19T07:40:30+05:30 IST