తగ్గిన కూరగాయల ధరలు

ABN , First Publish Date - 2022-04-09T17:09:22+05:30 IST

స్థానిక కోయంబేడు మార్కెట్‌లో పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతులు పెరగడంతో వాటి ధరలు తగ్గాయి. ఉగాది సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూరగాయల

తగ్గిన కూరగాయల ధరలు

పెరంబూర్‌(చెన్నై): స్థానిక కోయంబేడు మార్కెట్‌లో పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతులు పెరగడంతో వాటి ధరలు తగ్గాయి. ఉగాది సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూరగాయల దిగుమతులు తగ్గడంతో వారం రోజులుగా కూరగాయల ధరలు స్వల్పంగా పెరిగాయి. సాధారణంగా ప్రతిరోజు 450కి పైగా లారీల్లో కూరగాయలు దిగుమతవుతుండగా, పండుగ సందర్భంగా 300 లారీలు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం వచ్చే లారీల సంఖ్య పెరిగింది. అదే సమయంలో ఉదయం నుంచే ఎండ తీవ్రంగా ఉండడంతో మార్కెట్‌కు వచ్చే చిల్లర వ్యాపారుల సంఖ్య కూడా తగ్గడంతో, విక్రయాలు లేక కూరగాయల ధరలు తగ్గాయి. శుక్రవారం ఉదయం మార్కెట్‌లో కూరగాయల ధరల వివరాలు ఇలా ఉన్నాయి... టమోటా కిలో రూ.9, నాసిక్‌ ఉల్లి రూ.15, ఆంధ్ర ఉల్లి రూ.12, చిన్న ఉల్లి రూ.25, బంగాళాదుంపలు రూ.15, బీన్స్‌ రూ.50, ఊటీ క్యారట్‌ రూ.40, క్యారట్‌ రూ.20, ముల్లంగి రూ.8, మునక్కాయలు రూ.20, పచ్చి మిర్చి రూ.30 సహా అన్ని కూరగాయల ధరలు తగ్గాయని వ్యాపారులు తెలిపారు.

Updated Date - 2022-04-09T17:09:22+05:30 IST