భౌతికదూరం పాటించేలా మార్కెట్‌లు

ABN , First Publish Date - 2020-03-27T09:29:21+05:30 IST

కూరగాయలు, పండ్ల మార్కెట్‌లలో కొనుగోలుదారులు భౌతికదూరం పాటించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు.

భౌతికదూరం పాటించేలా మార్కెట్‌లు

కలెక్టర్‌ ఆదేశాలు


గుంటూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కూరగాయలు, పండ్ల మార్కెట్‌లలో కొనుగోలుదారులు భౌతికదూరం పాటించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధతో కలిసి నగరంలో ఏర్పాటుచేసిన 14 తాత్కాలిక కూరగాయలు, పండ్ల అమ్మకం ప్రదేశాలను పరిశీలించారు. మంగళదాసునగర్‌, ఏసీ కళాశాల సమీపంలో ఉన్న ఉల్ఫ్‌హాల్‌, బీఆర్‌ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న మార్కెట్లను పరిశీలంచి తగిన సూచనలు చేశారు. 


కూరగాయలు, పండ్లు అమ్మకాలు జరిగే ప్రదేశాలు

బ్రహ్మానందరెడ్డి స్టేడియం, పాతగుంటూరు యాదవ హైస్కూల్‌, నాజ్‌ సెంటర్‌లోని గుంటగ్రౌండ్స్‌, ఏసీ కళాశాల వద్ద ఉన్న ఉల్ఫ్‌హాల్‌, నగరంపాలెం స్టాల్‌ గరల్స్‌ హైస్కూల్‌, నల్లగుంట రెడ్డికాలేజ్‌, ఏటీ అగ్రహారం ఎస్‌కేబీఎం హైస్కూల్‌, లాడ్జిసెంటర్‌ లూథరన్‌ హైస్కూల్‌, లక్ష్మీపురం రోడ్డులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌, అమరావతి రోడ్డులోని మెడికల్‌ కాలేజ్‌ బాయ్స్‌హాస్టల్‌, అరండల్‌పేటలోని పిచ్చుకలగుంట, రింగురోడ్డులోని డాన్‌బాస్కో హైస్కూల్‌, హిమనీనగర్‌లోని నవీన స్కూల్‌ గ్రౌండ్స్‌, ఎస్‌వీఎన్‌ కాలనీలోని చిన్మయ్య హైస్కూల్‌. 


నిత్యావసర సరుకుల హోండెలివరీ సంస్థలు

అత్యవసరమైన నిత్యావసర సరుకులు బుకింగ్‌చేసిన 24 గంటల వ్యవధిలో డెలివరీ చేసేందుకు పలుసంస్థలు ముందుకొచ్చినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఆ వివరాలు... బృందావన్‌గార్డెన్స్‌లోని స్పెన్సర్స్‌  (సెల్‌నం: 75960 75492), విజేత సూపర్‌ మార్కెట్‌ (91007 87927), రిలయన్స్‌ మార్టులు అమరావతి రోడ్డు (73373 51537), లక్ష్మీపురం శాఖ (93469 98936), కొరిటెపాడు బ్రాంచ్‌ (91827 78702), అరండల్‌పేట విభాగం (83091 82177), కొత్తపేట బ్రాంచ్‌ (91540 03137), విజయదుర్గా సూపర్‌ మార్కెట్‌ అమరావతి రోడ్డు (94941 64615), డీమార్ట్‌ నాజ్‌ సెంటర్‌ (98209 30303), గుజ్జనగుళ్ల బ్రాంచ్‌ (88793 24900). 

Updated Date - 2020-03-27T09:29:21+05:30 IST