కూరగాయల తాత్కాలిక విక్రయ కేంద్రాలు

ABN , First Publish Date - 2021-05-06T05:40:14+05:30 IST

కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు నగర పాలక సంస్థ, మార్కెటింగ్‌శాఖ సమన్వయంతో కూరగాయల తాత్కాలిక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

కూరగాయల తాత్కాలిక విక్రయ కేంద్రాలు


కర్నూలు(కలెక్టరేట్‌), మే 5: కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు నగర పాలక సంస్థ, మార్కెటింగ్‌శాఖ సమన్వయంతో కూరగాయల తాత్కాలిక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గురువారం నుంచి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇది అందుబాటులో ఉంటాయని నగర పాలక కమిషనర్‌ డీకే బాలాజీ, మార్కెటింగ్‌ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.


విక్రయ కేంద్రాలు ఇవే..
-  వెంకాయపల్లె జి.పుల్లయ్య ఇంజనీరింగ్‌ కళాశాల ఎదురుగా..
- నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతం
- నంద్యాల రోడ్డులోని మారుతి మెగాసిటీ
- జొహరాపురం పాత డంప్‌యార్డు వద్ద ఉన్న 60 అడుగుల రహదారి
- అమ్మ హాస్పిటల్‌ వద్ద మున్సిపల్‌ పార్కులో
- అమీలియో హాస్పిటల్‌ వద్ద
- ఉస్మానియా కళాశాలలో ఉమర్‌ అరబిక్‌ కాలేజీ మైదానంలో
- వీటితో పాటు కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రీటైల్‌ కూరగాయల క్రయవిక్రయాలు పెద్దపాడు వద్దకు, పెద్దమార్కెట్‌ కూరగాయల కేంద్రాన్ని కర్నూలు ఎగ్జిబిషన్‌ మైదానంలోకి మార్పు చేస్తున్నట్లు నగర పాలక కమిషనర్‌ డీకే బాలాజీ తెలిపారు. నగరంలో ప్రస్తుతం ఉన్న రైతుబజార్లు యథావిధిగా పని చేస్తాయన్నారు. 9551309999, 7999999179, 9804464748, 8374542691 నెంబర్లకు ఫోన్‌ లేదా వాట్సాప్‌ ద్వారా అవసరమైన కూరగాయలు తెలిపితే డోర్‌ డెలివరీ చేస్తారని తెలిపారు.



Updated Date - 2021-05-06T05:40:14+05:30 IST