రేపు వెదిరె రామచంద్రారెడ్డి స్మారక పోస్టల్‌ కవర్‌ విడుదల

ABN , First Publish Date - 2022-07-16T05:29:04+05:30 IST

స్వాత్రంత్య సమరయోధుడు వెదిరె రామచంద్రారెడ్డి స్మారక పోస్టల్‌ కవర్‌ను ఈ నెల 17న విడుదల చేస్తున్నట్లు భూదాన్‌ రామచంద్రరెడ్డి స్మారక ట్రస్ట్‌ ట్రస్టీ వెదిరె అరవింద్‌ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రేపు వెదిరె రామచంద్రారెడ్డి స్మారక పోస్టల్‌ కవర్‌ విడుదల

పంజాగుట్ట, జూలై15(ఆంధ్రజ్యోతి): స్వాత్రంత్య సమరయోధుడు వెదిరె రామచంద్రారెడ్డి స్మారక పోస్టల్‌ కవర్‌ను ఈ నెల 17న విడుదల చేస్తున్నట్లు  భూదాన్‌ రామచంద్రరెడ్డి స్మారక ట్రస్ట్‌ ట్రస్టీ వెదిరె అరవింద్‌ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహాత్మాగాంధీ ఆధ్యాత్మిక వారసుడు, ఆచార్య వినోబాభావే భూదానఉద్యమానికి ఆకర్షితుడై ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పోచంపల్లిలో తన 1000 ఎకరాల భూమిని మొదట స్వచ్ఛందంగా పేదలకు దానం చేసిన భూదాన దాత, ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు వెదిరె రామచంద్రారెడ్డి ేసవలను గుర్తించి, ఆయన స్మారకార్థం పోస్టల్‌ శాఖ ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ రూపొందించిందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 17న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగే కార్యక్రమంలో పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ పి.విద్యాసాగర్‌రెడ్డి పోస్టల్‌ కవర్‌ను విడుదల చేస్తారని, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర నాయకుడు టి. కృష్ణగౌడ్‌ హాజరవుతున్నట్లు ఆయన వివరించారు. భూదాన్‌ ఉద్యభిమానులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. 

Updated Date - 2022-07-16T05:29:04+05:30 IST