అంబేడ్కర్‌ నుంచి విద్యార్థులు స్ఫూర్తి పొందాలి

ABN , First Publish Date - 2021-04-17T06:56:01+05:30 IST

అంబేడ్కర్‌ దార్శనికతను, అధ్యయన పటిమను గమనించి విద్యార్థులు స్ఫూర్తి పొందాలని సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ సి. సుమలత కోరారు.

అంబేడ్కర్‌ నుంచి విద్యార్థులు స్ఫూర్తి పొందాలి
వెబినార్‌లో ప్రసంగిస్తున్న సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి డాక్టర్‌ సి. సుమలత

సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి డాక్టర్‌ సి. సుమలత

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్‌ దార్శనికతను, అధ్యయన పటిమను గమనించి విద్యార్థులు స్ఫూర్తి పొందాలని సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ సి. సుమలత కోరారు. అంబేడ్కర్‌ 130 జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం సిటీ సివిల్‌ కోర్టు లీగల్‌ సర్వీసెస్‌ అఽథారిటీ ఆధ్వర్యంలో పెండేకంటి న్యాయకళాశాల విద్యార్థులకు ‘రాజ్యాంగంలోని ప్రాఽథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతలు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన వెబినార్‌లో పాల్గొని అవగాహన కలిగించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి పదం భావాన్ని, అంతరార్థం, రాజ్యాంగ సూత్రాలు, లక్ష్యాలను అర్థం చేసుకోవడం ద్వారా ఉన్నత ప్రమాణాలు కలిగిన న్యాయవాదులుగా ఎదగగలరన్నారు. అసమానతలను రూపుమాపేందుకు అంబేడ్కర్‌ చేసిన సేవలను ఆమె కొనియాడారు. సీనియర్‌ జడ్జి కె. మురళీమోహన్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమను తాము కాపాడుకోవడమే కాకుండా చుట్టుపక్కల వారి రక్షణ.. తద్వారా దేశరక్షణ ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని అన్నారు. వెబినార్‌లో న్యాయకళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌బీ ద్వారకానాథ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ పి. అరవింద, కో-ఆర్డినేటర్‌ శోభారాణి పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T06:56:01+05:30 IST