మాజీ సీఎం వసుంధర రాజే సింధియా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న అధిష్ఠానం

ABN , First Publish Date - 2021-01-24T01:36:58+05:30 IST

మాజీ సీఎం వసుంధర రాజే సింధియా విషయంలో బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెను

మాజీ సీఎం వసుంధర రాజే సింధియా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న అధిష్ఠానం

జైపూర్ : మాజీ సీఎం వసుంధర రాజే సింధియా విషయంలో బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెను తిరిగి రాష్ట్ర కోర్ కమిటీలోకి తీసుకుంటూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో అధిష్ఠానం ఆమెను పక్కన పెట్టేసింది. ఆమెకు గానీ, ఆమె వర్గానికి అంతగా ప్రాధాన్యం కల్పించలేదు. దీంతో ఆమె పేరుతో ఏకంగా ఓ పార్టీని స్థాపిస్తున్నట్లు ఆమె వర్గీయులు సంచలన ప్రకటన చేశారు. దీంతో అధిష్ఠానం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలను తెరదించాలన్న ఉద్దేశంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తం 16 మందితో కోర్ కమిటీని అధిష్ఠానం ప్రకటించింది. అందులో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ సింగ్ మేఘవాల్, కైలాశ్ చౌదరి ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు పూనీయా. గులాబ్ చంద్ కటారీయా తదితరులకు అధిష్ఠానం చోటు కల్పించింది. 


Updated Date - 2021-01-24T01:36:58+05:30 IST