వర్సిటీ సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-06-21T07:28:02+05:30 IST

తెలంగాణ విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలు పరి ష్కరించాలని డిమాండ్‌ చేస్తు సోమవారం వైస్‌ చాన్స్‌లర్‌ రవీందర్‌ గుప్తా చాంబర్‌ ఎదుట వర్సిటీ విద్యార్థులు నాలుగు గంటల పాటు బైటాయించి తమ సమస్యలపై వీసీని నిలదీసి ప్రశ్నించారు. అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో

వర్సిటీ సమస్యలు పరిష్కరించాలి
టీయూ మెయిన్‌ క్యాంపస్‌ ప్రధాన ద్వారం ఎదుట బాసర విద్యార్థులకు మద్దతుగా ధర్నా చేస్తున్న వర్సిటీ విద్యార్థులు

తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన

డిచ్‌పల్లి, జూన్‌ 20: తెలంగాణ విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలు పరి ష్కరించాలని డిమాండ్‌ చేస్తు సోమవారం వైస్‌ చాన్స్‌లర్‌ రవీందర్‌ గుప్తా చాంబర్‌ ఎదుట వర్సిటీ విద్యార్థులు నాలుగు గంటల పాటు బైటాయించి తమ సమస్యలపై వీసీని నిలదీసి ప్రశ్నించారు. అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు పరి పాలన భవనం లోని వీసీ చాంబర్‌ ఎదుట బైటాయించి నినాదాలు చేస్తూ పరిపా లన భవనం దద్దరిలిల్లెల నినాదాలతో హోరెత్తించారు. విద్యార్థుల సమస్యలను కట్టడి చేయాని వర్సిటీ అధికారులు చివరికి సమస్యలు పరిష్కరించేందుకు ముం దుకు వచ్చారు. ఆందోళన ఉధృతం అవ్వడంతో వీసీ పోలీసులకు సమాచారం అం దించారు. పోలీసులు వచ్చినా తామ బెదిరేదిలేదని సమస్యల పరిష్కారం కోసం బాసర విద్యార్థులు చేస్తున్న ఆందోళన లాగానే వర్సిటీ ఎదుట బైటాయిస్తామని పేర్కొనడంతో వీసీ రవీందర్‌ గుప్తా, రిజిస్ట్రార్‌ శివశంకర్‌లు పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులతో కలిసి వారంలోపు సమస్య పరిష్కరం చేస్తామన్నా.. విద్యార్థులు తగ్గలేదు. చివరకు వీసీ అప్పటికప్పుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం డి మాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వీసీ రవీందర్‌ గుప్తా, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ శివశంకర్‌లకు అందజేశారు. ఇందులో విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. 

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు మద్దతు 

బాసర ట్రిపుల్‌ ఐటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్‌ చేస్తూ గత వారం రోజులుగా విద్యార్థులు ఎండ, వానలను సైతం లెక్క చేయకుండా ఆందోళన చేస్తున్న సీఎం కేసీఆర్‌, విద్యశాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి స్పందించకపోవడం శోచనీయమని, వారి ఆందోళనకు సంఘీభావంగా తెలంగాణ విశ్వ విద్యాలయంలోని అన్ని విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు సోమవారం వర్సిటీ ప్రధాన గేటు వద్ద ఎండను సైతం లెక్క చేయకుండా 2గంటల పాటు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.   తెలంగాణ ప్రభుత్వం బాసర విశ్వవిద్యాలయాల్లో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని విద్యార్థులు మండిపడ్డారు.   బాసర ట్రిపుల్‌ ఐటీ పరిష్కరించే వరకు విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉంటామని పేర్కొ న్నారు.

Updated Date - 2022-06-21T07:28:02+05:30 IST