రిలే నిరాహార దీక్షలు చారిత్రాత్మకం

ABN , First Publish Date - 2022-06-26T06:13:10+05:30 IST

తల్లిలాంటి ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు 499 రోజులుగా ఉక్కు కార్మికులు అలుపెరగకుండా రిలే నిరాహార దీక్షలు చేయడం చారిత్రాత్మకమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు అన్నారు.

రిలే నిరాహార దీక్షలు చారిత్రాత్మకం
దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న వరసాల శ్రీనివాసరావు

నేటి కార్మిక మహా ప్రదర్శనను విజయవంతం చేయండి

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు

కూర్మన్నపాలెం, జూన్‌ 25: తల్లిలాంటి ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు 499 రోజులుగా ఉక్కు కార్మికులు అలుపెరగకుండా రిలే నిరాహార దీక్షలు  చేయడం చారిత్రాత్మకమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు అన్నారు. కూర్మన్నపాలెంలో శనివారం ఎస్‌ఎంఎస్‌-2 కార్మికులు పాల్గొన్న రిలే నిరాహార దీక్షల శిబిరంలో ఆయన మాట్లాడుతూ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం జరగ నున్న కార్మిక మహా ప్రదర్శనలో కార్మికులంతా పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్మికుల ఐక్య ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక కావాలని పిలుపునిచ్చారు. పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ఆదివారం వేలాది మంది ఉక్కు కార్మికులు, తదితరులతో బైక్‌ ర్యాలీగా డీఆర్‌ఎం కార్యాలయానికి చేరుకుంటా మన్నారు. అక్కడి నుంచి మహా ప్రదర్శ నగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియను తక్షణమే నిలిపి వేయాలని, దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలైన ప్రభుత్వ రంగ సంస్థల విక్రయాలను ఆపాలంటూ కార్మిక మహా ప్రదర్శనను నిర్వహిస్తున్నామన్నారు. ‘ఉక్కు’ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామన్న ప్రకటన వచ్చేంతవరకు ఉద్య మం కొనసాగుతోందన్నారు. నాయకుడు కేఎస్‌ఎన్‌ రావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలకు సొంత గనులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని విమర్శించారు. నాయకుడు జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఉక్కు కర్మాగారాలు, బ్యాంకులు.. ఇలా అన్నింటినీ కేంద్రం అమ్ముకుంటూ పోతే చివరు ఏం మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉక్కు’ పరిరక్షణ కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంధం వెంకటరావు, డీసీహెచ్‌ వెంకటేశ్వరరావు, జె.రామకృష్ణ, డి.సంపూర్ణం, గుమ్మడి నరేంద్ర, ఎల్లేటి శ్రీనివాసరావు, గంగవరం గోపి, తదితరులు పాల్గొన్నారు.

కార్మిక ప్రదర్శనకు తరలిరండి

ఉక్కు నిర్వాసితుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి శనివారం నాటికి 499 రోజులైనా ఎలాంటి న్యాయం జరగలేదని ఉక్కు నిర్వాసితుల సంఘం నాయకులు బొడ్డ గోవింద్‌, ప్రగడ వేణుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లపూడి సీడబ్ల్యూసీలో ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వాసితులకు నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ నిర్వాసితుల త్యాగాలకు విలువ లేదా అని ప్రశ్నించారు. ఆదివారం జరగనున్న కార్మిక మహా ప్రదర్శనలో ఉక్కు నిర్వా సితులంతా పెద్దసంఖ్యలో పాల్గొనవ లసిందిగా వారు కోరారు. నిర్వాసిత ఉద్యోగులకు, ఆర్‌-కార్డుదారులందరికీ ఉపాధి కల్పించకపోతే ప్రాణ త్యాగాలకైనా వెనకాడబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు జ్యోతి ప్రసాద్‌, పీవీ రమణ, ఇంటక్‌ నాయకుడు బుద్దిరెడ్డి అప్పారావు, సీఐటీయూ నాయకులు రామస్వామి, జగ్గారావు, దానప్పలు, వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

ప్రదర్శనను సక్సెస్‌ చేయాలి

ఉక్కు టౌన్‌షిప్‌: స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలనే డిమాండ్‌తో ఆదివారం జరగనున్న మహా కార్మిక ప్రదర్శనలో కార్మిక వర్గం భారీగా పాల్గొనవలసిందిగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. ప్లాంట్‌ సెంట్రల్‌ స్టోర్స్‌ జంక్షన్‌ వద్ద శనివారం ప్రచారం చేపట్టిన నాయకులు మాట్లాడుతూ ఉక్కు ఉద్యమంలో ప్రతీఒక్కరూ పాల్గొనవలి సందిగా కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు డి.ఆదినారాయణ, నీరుకొండ  రామచంద్రరావు, కేఎస్‌ఎన్‌ రావు, మస్తానప్ప, అప్పారావు, వరసాల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-26T06:13:10+05:30 IST