విజయవాడ: గుడివాడలో కేసినో జూదం గురించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశామని టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు. గురువారం టీడీపీ బృందం గవర్నర్‌ను కలిసింది. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ కేసినోపై కరపత్రాలు, ఆధారాలను గవర్నర్‌కు సమర్పించామన్నారు. గుడివాడ కేసినో గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసునని అన్నారు. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించారని విమర్శించారు. సీఎం జగన్‌రెడ్డి అయితే అసలు పట్టించుకోవడమే లేదని, దుర్మార్గపు మంత్రిని కాపాడాలన్నదే సీఎం ఆలోచనని అన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని తీసేశారని వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, ఆలపాటి రాజా తదితరులు ఉన్నారు.