Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాధితులకు దుస్తుల పంపిణీ

ఇందుకూరుపేట, నవంబరు 26 : మండలంలోని నిడిముసలి ప్రజాపరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తమ వంతు వితరణగా వరద బాధితులకు దుస్తులను అందజేశారు. రాజుకాలనీ, మూలపాడు గ్రామాల్లోని బాధితులకు శుక్రవారం పాఠశాలలో చీరలు, దుప్పట్లు,  లుంగీలు పంపిణీ చేశారు. దీంతోపాటు ఆహార పదార్థాలు, ముడి సరుకులను కూడా ఉపాధ్యాయులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు నేదురుమల్లి సుబ్బారెడ్డి, బ్యాంక్‌ చైర్మన్‌ కొండ్లపూడి శ్రీనివాసులురెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు దేవి, తదితరులు పాల్గొన్నారు. 


సండే మార్కెట్‌ లక్ష విరాళం

నెల్లూరు నగరంలోని సండే మార్కెట్‌ రోడ్‌ మార్జిన్‌ దుకాణాల సంస్థ వరద బాధితులకు రూ.1లక్ష నగదును విరాళంగా ప్రకటించినట్లు నిర్వాహకులు కిషోర్‌బాబు, ఆఫీజ్‌ తెలిపారు. శుక్రవారం వారు ఓ ప్రకటన విడుదల చేస్తూ సర్వస్వం కోల్పోయిన బాధితుల కోసం తమ వంతుగా సండే మార్కెట్‌ తరపున రూ.1లక్ష విరాళంగా అందజేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా  మరికొంత నగదు వసూలు చేసి బాధితులకు వంట సామాన్లు, దుస్తులు అందించగలమని వారు తెలియజేశారు. 


Advertisement
Advertisement