Advertisement
Advertisement
Abn logo
Advertisement

వంతెనను అందుబాటులోకి తీసుకురావాలి

యనమలకుదురులో టీడీపీ శ్రేణుల నిరసన

పెనమలూరు, డిసెంబరు 5: యనమలకుదురు వంతెనను తక్షణం అందుబాటులోకి తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఆది వారం టీడీపీ శ్రేణులతో కలసి ఆగిన వంతెన పనులు వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బోడె ప్రసాద్‌ మాట్లాడుతూ అత్యధిక జనాభా కలిగిన యనమలకు దురులో బందరు కాల్వపై సరైన వంతెన లేకపోవడం వల్ల నిత్యం ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు అనేక ఇబ్బం దులు పడుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాం లో దాదాపు వంతెన నిర్మాణం పూర్తయ్యిం దని, వైసీపీ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడిచినా తుది దశలో ఉన్న వంతెన పనులను పూర్తి చేయకపోవడం శోచనీ యమన్నారు. 2011లో ప్రస్తుత ఎమ్మెల్యే సారథి మంత్రిగా ఉన్న సమయంలో శిలాఫలకం వేసి నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశార న్నారు. అప్పటి నుంచి 2014 వరకు నిర్మాణ పనులు చేపట్టకుండా కాలం గడిపారన్నారు. 2014లో తాను ఎమ్మెల్యేగా గెలుపొందినపుడు ముఖ్యమంత్రి చంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లి కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణం చేపట్టామన్నారు. తుది దశలో ఉన్న అప్రోచ్‌ పనులు చేపట్టడానికి ప్రస్తుత ఎమ్మెల్యే సారథి ముం దుకు రావడం లేదన్నారు. వెంటనే వంతెన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల న్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అనుమోలు ప్రభాకరరావు, వెలగపూడి శంకర బాబు, బొర్రా కృష్ణ, కోయ ఆనంద్‌ ప్రసాద్‌, అనంతనేని ఆజాద్‌, యార్లగ డ్డ సుచిత్ర, షేక్‌ బుజ్జి,  నిర్మల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement