ధరల పెంపును రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-05-27T04:36:04+05:30 IST

పెట్రోల్‌, డీజీల్‌, గ్యాస్‌, నిత్యావసర ధరల పెంపును వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు.

ధరల పెంపును రద్దు చేయాలి
ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద వామపక్ష నేతల నిరసన

వామపక్ష నేతల నిరసన ప్రదర్శనలు

నెల్లూరు (వైద్యం), మే 26 : పెట్రోల్‌, డీజీల్‌, గ్యాస్‌, నిత్యావసర ధరల పెంపును వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ధరల పెంపునకు నిరసనగా గురువారం సీపీఎం, సీపీఐ నేతలు ఆర్టీసీ, ఆత్మకూరు బస్టాండ్‌లలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రయాణికులకు ధరల పెంపుపై కరపత్రాలు పంపిణీ చేశారు. సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, జిల్లా కమిటీ సభ్యులు మదాల వెంకటేశ్వర్లు, అల్లాడి గోపాల్‌లు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎక్కువగా ఉందని, దీని ప్రభావం నిత్యావసరాలపై పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పెట్రోల్‌ బంకుల వద్ద, 30న కలెక్టరేట్‌ వద్ద ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేత రాంబాబు, సీపీఎం నేతలు బత్తల కృష్ణయ్య, కొండా ప్రసాద్‌, నాగేశ్వరరావు, షేక్‌ మస్తాన్‌బీ, సూర్యనారాయణ, ఉడతా ప్రసాద్‌, నరసింహా, ఆర్‌ శ్రీనివాసులు, దేవతాటి సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T04:36:04+05:30 IST