అక్కడ వలంటీరే దిక్కు...

ABN , First Publish Date - 2021-03-05T05:11:46+05:30 IST

ప్రభుత్వం అందిస్తున్న వేల రూపాయలను జీతాలుగా పొందుతున్న ఉపాధ్యాయుల నిర్లక్ష్యవైఖరిలో ఏ మాత్రం మార్పు కనిపించడంలేదనే విమర్శలు రోజుకో చోట వ్యక్తమవుతూనే ఉన్నాయి.

అక్కడ వలంటీరే దిక్కు...
విధులు నిర్వహిస్తున్న యువతి

వరికుంటపాడు, మార్చి 4: ప్రభుత్వం అందిస్తున్న వేల రూపాయలను జీతాలుగా పొందుతున్న ఉపాధ్యాయుల నిర్లక్ష్యవైఖరిలో ఏ మాత్రం మార్పు కనిపించడంలేదనే విమర్శలు రోజుకో చోట వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా మండలంలోని గొల్లపల్లి ఎస్సీ కాలనీలోనూ గురువారం అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అక్కడ పని చేసే ఏకైక ఉపాధ్యాయుడు విధులకు హాజరు కాకపోవడంతో వలంటీరే ఆయన స్థానంలో ఉపాధ్యాయ అవతారమెత్తడం గమనార్హం. విధుల్లో ఉన్నప్పటికీ ఆ ఉపాధ్యాయుడు నెలవారీగా కొంత నగదు చెల్లించి ఓ యువతిని వలంటీర్‌గా నియమించుకోవడం చూస్తుంటే అతని పనితీరు ఏ విధంగా ఉందో తేటతెల్లమవుతోంది. రెండు రోజులుగా ఆ ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకపోవడంతో ఆ యువతే అన్ని తానై పాఠశాలలో కీలక బాధ్యత వ్యవహరించడంపై సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. గతంలోనూ ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్నా పట్టించుకున్న నాధులేలేరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


Updated Date - 2021-03-05T05:11:46+05:30 IST