దేశభక్తి చాటేలా వజ్రోత్సవ కార్యక్రమాలు

ABN , First Publish Date - 2022-08-09T05:03:19+05:30 IST

స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలను ఘనంగా పండుగ వాతావరణంలో దేశ భక్తి చాటేలా సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లతో కలిసి జిల్లా, మండలస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.

దేశభక్తి చాటేలా వజ్రోత్సవ కార్యక్రమాలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

అధికారులకు కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ ఆదేశం

ఆదిలాబాద్‌ టౌన్‌, ఆగస్టు 8: స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలను ఘనంగా పండుగ వాతావరణంలో దేశ భక్తి చాటేలా సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లతో కలిసి జిల్లా, మండలస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లోని ప్రతీ పౌరుడు ఈ వజ్రోత్సవ కార్యక్రమంలో పాల్గొనే విధంగా వార్డు, గ్రామ, మండల స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో సమావేశాలు నిర్వహించి ప్రజలకు భారత వజ్రోత్సవ కార్యక్రమాలపై చేప డుతున్న కార్యక్రమాలను వివరించాలని సూచించారు. ఈ నెలలో రెండు వారాల పాటు వజ్రోత్సవ కార్యక్రమాలను ఘనంగా, జాతీయ భావన ఉట్టి పడేలా కార్యక్రమాలను ప్రభుత్వం ఆదేశించిన మేరకు నిర్వహించాలని అధికారు లను ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని అన్నిప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న అధికారి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ఈ కార్యక్రమాలలో పాల్గొనే విధంగా మోటివేషన్‌ సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రజలంద రినీ భాగస్వాములు చేయాలని, ప్రతీరోజు నిర్వహించే కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ నెల 15న నిర్వ హించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, దేశ భక్తికి సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. స్వతం త్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈనెల 9 నుంచి 11, అలాగే 16 నుంచి 21 వరకు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు ప్రభుత్వ, ప్రైవే ట్‌ విద్యా సంస్థలలో 6నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యా ర్థులకు గాంధీ చిత్రాన్ని స్థానిక సినిమా హళ్లలో ఉచితంగా ప్ర దర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులను ఏయే పాఠశాల నుంచి ఏ సినిమా హాల్‌కు తీసుకు వెళ్లాలని ప్రణాళికను సిద్ధం చేసి విద్యార్థులను  ప్రత్యేక వాహనాలలో ఉపాధ్యాయులను ఇన్‌చార్జీల ను నియమించి తీసుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు తాగునీరు, అల్పాహారం, తదితర సౌకర్యాలను కల్పించాలని విద్యాశాఖ అధి కారులను ఆదేశించారు. స్ర్తీ శిశు సంక్షేమ శాఖ ద్వారా హెల్దీ బేబీ, హెల్దీ మదర్‌ కార్యక్రమాలను శాఖ పరమైన ఆదేశాల మేరకు నిర్వహించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. అనంతరం రెండు వారాల పాటు జిల్లాలో చేపట్టనున్న వజ్రోత్సవ కార్యక్రమాల నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌ భాషాషేక్‌ వివరిస్తూ 9నుంచి 12లోగా ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేయాలని, 10వ తేదీన వనమహోత్సవం, 11న ఉదయం 6.30గంటలకు స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ప్రీడమ్‌ రన్‌, 12న రక్షాబంధన్‌ సందర్భంగా స్థానిక కేబుల్‌ టీవీల ద్వారా దేశభక్తి సినిమాలు, 13న జిల్లా వ్యాప్తంగా వజ్రోత్సవ ర్యాలీ, 14న జిల్లా పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో   సాంస్కృతిక కార్యక్రమాలు, 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, 16న జాతీయ గీతాలాపన, 17న రక్తదాన శిబిరాలు, 18న జరిగే ప్రీడమ్‌ కప్‌, 19న ఆసుపత్రులు, జైళ్లు, అనాత,వృద్ధాశ్రమాలలో పండ్లు, స్వీట్లు పంపిణీ, 20న స్వయం సహాయక సంఘాల మహిళలచే దేశభక్తి అంశం పై రంగోళి, 21న గ్రామ పంచాయతీ, మున్సిపల్‌, మండల, జిల్లా ప్రజా పరిషత్‌లలో ప్రత్యేక సమావేశాలు, 22న ఎల్‌బీ స్టేడియం హైదరాబాద్‌లో వజ్రోత్సవ ముగింపు కార్యక్రమం ఉంటుదన్నారు.  

Updated Date - 2022-08-09T05:03:19+05:30 IST