రాజ్యసభకు వద్దిరాజు ఏకగ్రీవం

ABN , First Publish Date - 2022-05-24T06:49:48+05:30 IST

రాజ్యసభకు వద్దిరాజు ఏకగ్రీవం

రాజ్యసభకు వద్దిరాజు ఏకగ్రీవం
ఏకగ్రీవ పత్రంతో గాయత్రి రవి

రవిచంద్రను అభినందించిన జిల్లా నేతలు

ఖమ్మం, మే 23(ఆంధ్రజ్యోతిప్రతినిధి): రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయనకు ఎన్నికల సంఘం ఏకగ్రీవ ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని సోమవారం అందించింది. ఈ సందర్భంగా రవిచంద్రకు మహబూబాబాద్‌ ఎంపీ మాలోత కవిత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, తాతామధుసూదన అభినందనలు తెలిపారు. అలాగే రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ నామ నాగేశ్వరరావుతో పాటు జిల్లాకు చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు,ఎమ్మెల్యేలు గాయత్రి రవికి ఫోనలో శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా నుంచి రాజ్యసభకు నల్లమల గిరిప్రసాద్‌, యలమంచిలి రాధాకృష్ణమూర్తి, రేణుకాచౌదరి ఎంపికయ్యారు. తాజాగా గాయత్రి రవి రాజ్యసభలో ప్రవేశించే అవకాశం జిల్లా నుంచి లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రె స్‌ను వీడి టీఆర్‌ఎ్‌సలో చేరి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు దగ్గరయ్యారు. పలు ఎన్నికల్లో పార్టీకి ఆర్థిక సహకారం అందించారు. ప్రస్తుతం రాజ్యసభ సీటు ఖాళీకావడంతో మున్నూరుకాపు సామాజికవర్గాన్ని దృష్టి లో ఉంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దిరాజు రవిచంద్రకు రాజ్యసభ అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ప్రముఖ గ్రానైట్‌ వ్యాపారిగా ఎదిగిన రవిచంద్ర రాజ్యసభకు ఎన్నికవడంతో ప్రజాప్రతినిధిగా ఆయన చట్టసభలో గళం వినిపించనున్నారు. 

Updated Date - 2022-05-24T06:49:48+05:30 IST