వ్యాక్సిన్‌ వేయండి.. ప్రాణాలు కాపాడండి

ABN , First Publish Date - 2021-05-09T06:24:37+05:30 IST

వ్యాక్సిన్‌ వేయండి.. ప్రాణాలు కాపాడండి

వ్యాక్సిన్‌ వేయండి.. ప్రాణాలు కాపాడండి
17వ డివిజన్‌ పార్టీ కార్యాలయంలో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

 రాణిగారితోట, మే 8 : రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ వెంటనే వ్యాక్సిన్‌ వేసి ప్రాణాలు కాపాడాలని  17వ డివిజన్‌ టీడీపీ నాయకులు ముని పోలిపల్లి, విస్రం డానియల్‌ అన్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 17,18,19 డివిజన్ల టీడీపీ నాయ కులు కరోనా నిబంధనలను పాటిస్తూ.. 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ వేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 17వ డివిజన్‌ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆదిబాబు, మల్లెల కుమారి తదితరులు పాల్గొన్నారు.  18వ డివి జన్‌లో టీడీపీ డివిజన్‌ అధ్యక్షుడు వేముల దుర్గారావు పార్టీ కార్యాలయంలో వ్యాక్సిన్‌ వేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. డివిజన్‌ నాయకులు పీరుబాబు మాట్లాడుతూ  ప్రభుత్వం అందరికీ వ్యాక్సిన్‌ వేయాలని, ఐసోలేషన్‌ సెంటర్లు  ఏర్పాటు, రాణిగారితోట ప్రాంతంలో కొవిడ్‌ నివారణా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 19వ డివిజన్‌లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.ఫిరోజ్‌  వ్యాక్సిన్‌ వేయాలని  నిరసన కార్యక్రమం నిర్వహించారు. 

విజయవాడ రూరల్‌ మండలంలో..

విజయవాడ రూరల్‌ : మండలంలోని అన్ని గ్రామాల్లోనూ తెలుగుదేశం పార్టీ నాయకులు కరోనా వ్యాక్సిన్‌ వేసి ప్రజల ప్రాణాలను కాపాడాలంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విజయవాడ రూరల్‌ మండల అధ్యక్షుడు గొడ్డళ్ల చిన రామారావు అంబాపురంలోని తన నివాసంలో నిరసన చేపట్టగా, గన్నవరం నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యుడు దండు సుబ్రహ్మణ్యరాజు నున్నలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అలాగే పాతపాడు, పీ నైనవరం, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరులోనూ నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

 మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

గన్నవరం : కరోనా మృతులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న డిమాండ్‌ చేశారు. టీడీపీ ఇచ్చిన పిలుపులో భాగంగా కరోనా రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వండి, ప్రజల ప్రాణాలు కాపాడండి అంటూ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న ఇంట్లో శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నియంత్రత్వ పోకడతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరోనాతో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఇచ్చిన హామీల అమల్లో  సీఎం జగన్‌ విఫలమయ్యారన్నారు. 

అందరికీ  వ్యాక్సిన్‌ వేయాలి

హనుమాన్‌జంక్షన్‌  : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అందరికీ వాక్సిన్‌ వేయాలని డిమాండు చేస్తూ శనివారం టీడీపీ బాపులపాడు మండల మహిళా నాయకురాళ్లు   వారి స్వగృహాల్లో నిరసన పాటించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు మేరకు హనుమాన్‌జంక్షన్‌ జిల్లా టీడీపీ మహిళా విభాగం నాయకురాళ్లు మూల్పూరి సాయి కల్యాణి, వడ్డిల్లి లక్ష్మీ తదితరులు వారి గృహాల వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రజలందరికీ వాక్సిన్‌ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  బాపులపాడు టీడీపీ అధ్యక్షులు అట్లూరి శ్రీని వాసరావు  ఇంటి వద్ద  నిరసన పాటించారు. 

రంగన్నగూడెంలో

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌  : ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడానికి ప్రజాధనం 3వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన యువతకు వ్యాక్సిన్‌ వేయించేందకు 16 వందల కోట్లు ఖర్చు చేసి వ్యాక్సిన్‌ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని రాష్ట్ర సాగునీటి సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు విమర్శిం చారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రంగన్న గూడెంలోని తన స్వగృహంలో శనివారం ప్లకార్డు చేబూని ఆయన నిరసన వ్యక్తంచేశారు. 

Updated Date - 2021-05-09T06:24:37+05:30 IST