రోజూ 100 మందికి టీకాలు

ABN , First Publish Date - 2021-01-18T05:04:48+05:30 IST

ప్రతి రోజూ 100 మందికి కరోనా వ్యాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు డీఎంహెచ్‌వో కె.చంద్రనాయక్‌ తెలిపారు.

రోజూ 100 మందికి టీకాలు
సూచనలు చేస్తున్న డీఎంహెచ్‌వో చంద్రనాయక్‌

 డీఎంహెచ్‌వో చంద్రనాయక్‌

ఎచ్చెర్ల : ప్రతి రోజూ 100 మందికి కరోనా వ్యాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు డీఎంహెచ్‌వో కె.చంద్రనాయక్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక పీహెచ్‌సీని సందర్శించి... వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 18 కేంద్రాల్లో కరోనా టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. తొలి విడతలో వైద్య సిబ్బందికి అవకాశం కల్పించినట్టు తెలిపారు. కాగా ఎచ్చెర్ల పీహెచ్‌సీలో ఆదివారం 72 మందికి టీకాలు వేశారు. పీహెచ్‌సీ వైద్యాధికారి వి.కిశోర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

 గార: శ్రీకూర్మం పీహెచ్‌సీలో ఆదివారం రెండో రోజూ ఆదివారం కూడా కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగింది. 80 మంది ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బందికి టీకా వేశారు. మండల ప్రత్యేకాధికారి గుత్తు రాజారావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ జెన్ని రామారావు, ఎంపీడీవో ఎస్‌.రామ్మోహన్‌రావు, స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారిణి ఎన్‌.పద్మావతి, ఇతర వైద్య సిబ్బంది పర్యవేక్షించారు. గార ఎస్‌ఐ హరికృష్ణ ఆధ్వర్యంలో పీహెచ్‌సీ వద్ద పర్యవేక్షణ జరిగింది. 

ఇచ్ఛాపురం : ఇచ్ఛాపురం సీహెచ్‌సీలో రెండో రోజు 52 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశామని వైద్యాధికారి దామోధర్‌ప్రధాన్‌ తెలిపారు. దశలు వారీగా అందరికీ వ్యాక్సిన్‌ అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్పెషట్‌ డెప్యూటీ కలెక్టర్‌ టి.సీతారాం, డాక్టర్‌ ఆర్‌.స్వాతి, ఎస్‌ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. 

 

 


Updated Date - 2021-01-18T05:04:48+05:30 IST