జర్నలిస్టులకు వ్యాక్సిన్‌ అందించాలి

ABN , First Publish Date - 2021-01-14T05:31:32+05:30 IST

వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందితో పాటు ప్రింట్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్‌ మీడియా విలేకరులను కూడా వారియర్స్‌గా గుర్తించి మొదటి విడతలో కరోనా వ్యాక్సిన్‌ను అందించాలని ఏజెన్సీ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు బేతా కుమారస్వామి, ఉపాధ్యక్షుడు పైడ కొండలరావు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు

జర్నలిస్టులకు వ్యాక్సిన్‌ అందించాలి

గుమ్మలక్ష్మీపురం, జనవరి 13: వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందితో పాటు ప్రింట్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్‌ మీడియా విలేకరులను కూడా వారియర్స్‌గా గుర్తించి మొదటి విడతలో కరోనా వ్యాక్సిన్‌ను అందించాలని ఏజెన్సీ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు బేతా కుమారస్వామి, ఉపాధ్యక్షుడు పైడ కొండలరావు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ప్రకటనలో కోరారు. కరోనా విజృంభించిన సమయంలో ఎలకా్ట్రనిక్‌, ప్రింట్‌ మీడియా విలేకరులు కూడా సకాలంలో సమాచారం అందించడానికి ఎంతో కృషి చేశారన్నారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు విలేకరులను కూడా ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా గుర్తించిందని, కావున ప్రభుత్వాలు స్పందించి విలే కరులకు కూడా మొదటి విడతలోనే కరోనా వ్యాక్సిన్‌ను అందించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-01-14T05:31:32+05:30 IST