ARMY-EASTERN కమాండ్‌లో ఖాళీలు

ABN , First Publish Date - 2022-05-02T20:25:28+05:30 IST

ఇండియన్‌ ఆర్మీకి చెందిన ఈస్టర్న్‌ కమాండ్‌, కోల్‌కతాలోని కమాండ్‌ హాస్పిటల్‌ పరిధిలోని వివిధ ఏఎంసీ యూనిట్లలో 158 గ్రూప్‌-సి సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

ARMY-EASTERN కమాండ్‌లో ఖాళీలు

ఇండియన్‌ ఆర్మీకి చెందిన ఈస్టర్న్‌ కమాండ్‌, కోల్‌కతాలోని కమాండ్‌ హాస్పిటల్‌ పరిధిలోని వివిధ ఏఎంసీ యూనిట్లలో 158 గ్రూప్‌-సి సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: బార్బర్‌-09; చౌకీదార్‌-12; ఎల్‌డీసీ-03; సఫాయివాలా-35; హెల్త్‌ఇన్‌స్పెక్టర్‌-18; కుక్‌-03; టీ/మేట్‌-08; వార్డ్‌ సహాయక్‌-53; వాషర్‌మన్‌-17

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు సూచించిన ట్రేడ్‌/కోర్సు సర్టిఫికెట్‌ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం, టైపింగ్‌ నైపుణ్యాలు ఉండాలి. 

వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

పరీక్ష విధానం: ఈ పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది.








దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి

వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in/

Updated Date - 2022-05-02T20:25:28+05:30 IST