ఉత్తరాఖండ్ గవర్నర్‌గా ఆర్మీ మాజీ అధికారి

ABN , First Publish Date - 2021-09-15T20:57:32+05:30 IST

ఉత్తరాఖండ్ గవర్నర్‌గా ఆర్మీ మాజీ అధికారి

ఉత్తరాఖండ్ గవర్నర్‌గా ఆర్మీ మాజీ అధికారి

డెహ్రడూన్: ఉత్తరాఖండ్ గవర్నర్‌గా మాజీ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని డెహ్రడూన్‌లో ఉన్న రాజ్‌భవన్‌లో గుర్మీత్ సింగ్‌ చేత ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్‌గా పదవీ విరమణ చేసిన గుర్మీత్ సింగ్‌కి సైన్యంలో బయటా మంచి పేరు ఉన్నట్లు చెప్పుకుంటారు. ఈ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సహా మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈయనకు ముందు ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బేబీ రాణి మౌర్య పని చేశారు. వారం రోజుల క్రితం వ్యక్తిగత కారణాలతో గవర్నర్ పదవికి బేబీ మౌర్య రాజీనామా చేశారు.

Updated Date - 2021-09-15T20:57:32+05:30 IST