జోషీమఠ్ పేరు ఇకపై జ్యోతిర్‌మఠ్ : ఉత్తరాఖండ్ సీఎం

ABN , First Publish Date - 2021-12-27T17:30:09+05:30 IST

ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్ పేరును జ్యోతిర్‌మఠ్‌గా మార్చాలని

జోషీమఠ్ పేరు ఇకపై జ్యోతిర్‌మఠ్ : ఉత్తరాఖండ్ సీఎం

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్ పేరును జ్యోతిర్‌మఠ్‌గా మార్చాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. నందన్ నగర్ (ఘాట్)లో జరిగిన ‘విజయ సంకల్ప’ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. బదరీనాథ్‌కు ముఖద్వారంగా ఈ మఠాన్ని పరిగణిస్తారు. 


చమోలీ జిల్లాలో రూ.56 కోట్ల విలువైన అభివృద్ధి పథకాలకు ధామి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, చిట్టచివరి వ్యక్తి వరకు అభివృద్ధిని తీసుకెళ్ళాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ లక్ష్య సాధన కోసం తాము పగలు, రాత్రి తేడా లేకుండా కృషి చేస్తున్నామన్నారు. 


త్వరలోనే ఉత్తరాఖండ్ శాసన సభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెనుక బ్రాహ్మణులు, స్థానికులను మచ్చిక చేసుకోవాలనే వ్యూహం ఉందని విమర్శకులు చెప్తున్నారు.  చమోలీ జిల్లాలోని ఘాట్ బ్లాక్‌కు ఇటీవలే నందన్ నగర్ అని పేరు మార్చారు. 


బదరీనాథుడు శీతాకాలంలో జోషీమఠ్‌లో పూజలందుకుంటాడు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన నాలుగు మఠాల్లో ఇదొకటి. మిగిలినవి శృంగేరీ, పూరీ, ద్వారకలలో ఉన్నాయి. 


Updated Date - 2021-12-27T17:30:09+05:30 IST