Kanwar Yatra: కత్తులు, త్రిశూలపై Uttarakhand నిషేధం

ABN , First Publish Date - 2022-07-14T00:57:00+05:30 IST

ఏటా పదిహేను రోజుల పాటు శివభక్తులు ఎంతో భక్తిప్రపత్తులతో చేపట్టే 'కన్వర్ యాత్ర'పై ఉత్తరాఖండ్ ప్రభుత్వ ..

Kanwar Yatra: కత్తులు, త్రిశూలపై Uttarakhand నిషేధం

డెహ్రాడూన్: ఏటా పదిహేను రోజుల పాటు శివభక్తులు ఎంతో భక్తిప్రపత్తులతో చేపట్టే 'కన్వర్ యాత్ర' (Kanwar Yatra)పై ఉత్తరాఖండ్ ప్రభుత్వ యంత్రాంగం తాజా ఆదేశాలు ఇచ్చింది. కత్తులు, త్రిశూలాలు, ఇతర ప్రమాదకర వస్తువులతో వచ్చే యాత్రికులను అనుమతించేది లేదని తెలిపింది. జిల్లా సరిహద్దుల వద్దే అలాంటి వస్తువులను సీజ్ చేయాలని అన్ని పోలీస్ స్టేషన్లు, ఔట్ పోస్ట్ ఇన్‌చార్జులకు ఆదేశాలు జారీ చేసింది. జూలై 14 నుంచి కన్వర్ యాత్ర ప్రారంభం కానుంది.


''ఈనెల 14 నుంచి ప్రారంభమయ్యే కన్వర్ యాత్రలో కత్తులు, త్రిశూలాలు, కర్రలపై నిషేధం ఉంది. జిల్లా సరిహద్దుల వద్దే వాటిని స్వాధీనం చేసుకోవాలని పోలీస్ స్టేషన్లు, ఔట్ పోస్ట్‌లకు ఆదేశాలు ఇచ్చాం'' అని డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) జనమేజయ్ ఖండూరి తెలిపారు. శివ భక్తులు ఏటా కన్వర్ యాత్ర చేస్తుంటారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గోముఖ్, గంగోత్రి, బీహార్‌లోని సుల్తాన్‌గంజ్ తదితర ప్రాంతాలను దర్శించి అక్కడి పవిత్ర గంగాజలాలను సేకరిస్తారు. ఆ గంగాజలాలతో తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో అభిషేకం చేస్తారు. కరోనా మహమ్మారి కారణంగా 2021లో కన్వర్ యాత్రను ఉత్తారఖండ్ ప్రభుత్వం రద్దు చేసింది. 'హర్ కి పౌరి' ప్రవేశద్వారం వద్ద ఆంక్షలు విధించింది.

Updated Date - 2022-07-14T00:57:00+05:30 IST