కొవిడ్ పరీక్షల్లో రికార్డులకెక్కిన ఉత్తరప్రదేశ్

ABN , First Publish Date - 2020-10-01T21:39:31+05:30 IST

కొవిడ్ పరీక్షల్లో ఉత్తరప్రదేశ్ రికార్డులకెక్కింది. దేశంలో కోటి పరీక్షలు చేసిన తొలి రాష్ట్రంగా అవతరించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి

కొవిడ్ పరీక్షల్లో రికార్డులకెక్కిన ఉత్తరప్రదేశ్

లక్నో: కొవిడ్ పరీక్షల్లో ఉత్తరప్రదేశ్ రికార్డులకెక్కింది. దేశంలో కోటి పరీక్షలు చేసిన తొలి రాష్ట్రంగా అవతరించింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ తెలిపారు. అత్యధిక జన సాంద్రతతో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో తొలి నుంచి ఎంతో అప్రమత్తంగా ఉన్నట్టు పేర్కొన్నారు. మహమ్మారి మరింత విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పారు. పరీక్ష (టెస్ట్), గుర్తింపు (ట్రాక్), చికిత్స (ట్రీట్)తో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలిపారు.  


వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందితోపాటు రెవెన్యూ, పోలీస్, పట్టణ స్థానిక విభాగాలు, పంచాయతీరాజ్ సంస్థల నిరంతర కృషితో కేసులు నియంత్రణలోకి వచ్చినట్టు అమిత్ మోహన్ తెలిపారు. రెండు వారాల వ్యవధిలోనే యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు 25 శాతానికి తగ్గినట్టు పేర్కొన్నారు. తమ వద్ద రోజుకు 100 నమూనాలను మాత్రమే పరీక్షించే సామర్థ్యం ఉన్న లేబరేటరీ ఉందని, దీంతో శాంపిళ్లను ఎన్ఐవీ, పూణెలకు పంపి నిర్ధారించుకున్నట్టు వివరించారు. 


గత 24 గంటల్లో కొత్తగా 1.61 లక్షల పరీక్షలు నిర్వహించామని, దీంతో రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 1,00,98,896 చేరుకున్నట్టు తెలిపారు. వీటిలో దాదాపు 42 శాతం పరీక్షలు ఆర్‌టీ పీసీఆర్ విధానంలో చేసినట్టు వివరించారు. 

Updated Date - 2020-10-01T21:39:31+05:30 IST