ఉట్లమాను మహోత్సవం

ABN , First Publish Date - 2022-08-14T05:12:50+05:30 IST

మండలపరిధిలోని చిగిచెర్లలో ఉట్లమాను మహోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పీర్లపండుగ ముగిసిన మూడు రోజులకు ఈ ఉట్లమాను ఉత్సవాన్ని పీర్లచావిడి ఎదురుగా అనాధిగా నిర్వహించారు.

ఉట్లమాను మహోత్సవం
ఉట్లమాను ఎక్కుతున్న గ్రామస్థులు

ధర్మవరంరూరల్‌, ఆగస్టు 13 : మండలపరిధిలోని చిగిచెర్లలో ఉట్లమాను మహోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. పీర్లపండుగ ముగిసిన మూడు రోజులకు ఈ ఉట్లమాను ఉత్సవాన్ని పీర్లచావిడి ఎదురుగా అనాధిగా నిర్వహించారు. ముందుగా పీర్ల మకానలో ఉన్న మౌలాలిస్వామికి చక్కెర చదివింపులు చేసి గజమాలలతో అందంగా అలంకరించారు. అనంతరం ఉట్లమాను గ్రామానికి చెందిన యువకులు, పెద్దలు ఉత్సాహంగా ఎక్కి సంబరంగా చేసుకున్నారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు క్రిష్ణారెడ్డి, పెద్దిరెడ్డిగారి శివారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సుబ్బప్పగారి ఓబిరెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-14T05:12:50+05:30 IST