వ్యవసాయ పనిముట్లను ప్రదర్శిస్తున్న అధికారులు
రైల్వేకోడూరు రూరల్, జనవరి 20: ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు వినియోగించుకోవాలని రైల్వేకోడూరు వ్యవసాయ అధికారి కవిత తెలిపారు. గురువారం ఎంపీడీవో ఆవరణలో ఉన్న వ్వవసాయ కార్యాలయం వద్ద వైఎస్సార్ యంత్ర సేవ పథకం ద్వారా రాయితీ కింద ఇచ్చే 12 లక్షల రూపాయిల విలువైన వ్యవసాయ పనిముట్లను ప్రదర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులుకు 10 శాతం గ్రూప్ షేర్, 50 శాతం బ్యాంక్ రుణం, 40 శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు ఈ పథకాని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజరెడ్డి, ఉప సర్పంచ్ తోట శివసాయి, కోడూరు వ్యవసాయ అధికారి సుధాకర్, ఓబులవారిపల్లి అధికారి శ్రీరాములు, చిట్వేల్ అధికారి సందీప్, ఇన్‌చార్జ్ ఎంపీడీవో నాగార్జున రైతులు తదితరులు పాల్గొన్నారు.