Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాల్షియం సప్లిమెంట్లు ఎవరెవరు, ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసా?

ఆంధ్రజ్యోతి(04-01-2022)

క్యాల్షియం సప్లిమెంట్ల మీద అవగాహన పెరిగింది. అయితే క్యాల్షియం మోతాదు వ్యక్తులు, వయసులను బట్టి మారుతుంది. 


గర్భిణులు, పాలిచ్చే తల్లులు పాలు తాగడంతో పాటు, రోజుకి 2 గ్రాముల క్యాల్షియం సప్లిమెంటు అదనంగా తీసుకోవాలి. 


ప్రి మెనోపాజ్‌ దశలో (అమెనోరియా) మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ తయారవదు. కాబట్టి రోజుకి ఒకటిన్నర గ్రాముల క్యాల్షియం తీసుకోవాలి. 


మెనోపాజ్‌కు చేరుకున్న తర్వాత అవసరాన్నిబట్టి ఒకటిన్నర నుంచి 2 గ్రాముల వరకూ క్యాల్షియం తీసుకోవచ్చు. 


తీవ్ర రుగ్మత నుంచి కోలుకుంటున్న దశలో కూడా ఎక్కువ క్యాల్షియం అవసరమవుతుంది. 


అయితే ఎంత క్యాల్షియం అవసరమనేది తెలుసుకోవటం కోసం ఎముకల వైద్యుల చేత పరీక్షలు చేయించుకుని, సూచించిన మోతాదు మేరకు తీసుకోవాలి. 

Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement