Advertisement
Advertisement
Abn logo
Advertisement

కె- విటమిన్ ఏయే ఆహారపదార్థాల్లో ఉంటుంది?

ఆంధ్రజ్యోతి(24-02-2020)

ప్రశ్న: కె-విటమిన్‌ ఉపయోగాలేమిటి? అది ఏయే ఆహారాల్లో లభిస్తుంది?

- జగదీశ్‌, తణుకు


జవాబు: మనకు దెబ్బలు తగిలినప్పుడో ఏవైనా గాయాలైనప్పుడో ... ఆ చోట రక్తం గడ్డ కట్టాలంటే విటమిన్‌-కె ఎంతో అవసరం. కేవలం రక్తం గడ్డకట్టడానికే కాదు, రక్తంలో కాల్షియం స్థాయిని నియంత్రించడానికి, ఎముకల పనితీరు మెరుగు పడటానికి విటమిన్‌-కె కావాలి. ఆహారం ద్వారా మనం తీసుకునే విటమిన్‌- కె, కాలేయంలో నిల్వ అవుతుంది.  ఆరోగ్యవంతుల్లో విటమిన్‌- కె లోపం ఉండదు. సీలియాక్‌ వ్యాధి, సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌, అల్సరేటివ్‌ కొలైటిస్‌ మొదలైన సమస్యలున్నవారిలో  మాత్రం విటమిన్‌-కె లోపానికి అవకాశం ఎక్కువ. పద్దెనిమిదేళ్లు దాటిన ఆడవాళ్ళకి రోజుకు 90 మైక్రోగ్రాములు, మగవాళ్లకు రోజుకు 120 మైక్రోగ్రాములు విటమిన్‌-కె కావాలి. క్యాబేజీ, అన్ని రకాల ఆకుకూరలు, బెండకాయలు, ఉల్లికాడలు, పచ్చి బఠాణి, కీర, కివి పండ్లలో విటమిన్‌- కె అధికంగా ఉంటుంది. రరబ్రకోలి లోను, బ్రస్సెల్‌  మొలకలలో కూడా విటమిన్‌-కె అధికం. రోజూ ఏదో ఓ పూట ఓ కప్పు ఆకుకూరలు తీసుకుంటే ఆ రోజుకు కావలసిన విటమిన్‌- కె అందుతుంది. రక్తం పలచబడడం కోసం మందులు వాడేవారు మాత్రం విటమిన్‌- కె ఎక్కువగా ఉండే ఆహారం పుచ్చుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...