Abn logo
Jun 12 2021 @ 00:00AM

స్టూడెంట్స్‌కి యూజ్‌ఫుల్‌ గాడ్జెట్స్‌

గత ఏడాది అంతా ‘స్కూల్‌ ఫ్రమ్‌ హోమ్‌’గా మారింది. ఈ సంవత్సరం కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.  ఈ వేసవి సెలవులు ముగియగానే మళ్ళీ ఆన్‌లైన్‌ క్లాసులు మొదలయ్యే అవకాశం ఉంది.  ల్యాప్‌టాప్‌లు, కీ బోర్డులు, టాబ్లెట్స్‌, ప్రింటర్స్‌ వంటివన్నీ విద్యార్థులకు అవసరమవుతాయి. అలాంటివన్నీ అమెజాన్‌ డిస్కౌంట్‌ సేల్స్‌లో ఇచ్చేందుకు సమాయత్తమైంది. పదివేల రూపాయల లోపునకే అందే ఈ పది గాడ్జెట్స్‌నూ ఒక్కసారి చూడండి. లెనోవా టాబ్‌  ఎం8 హెచ్‌డి టాబ్లెట్‌

రూ.8,991

(అసలు ధర రూ.14,000)

చిన్న పిల్లలకు లెనోవా టాబ్‌ కొనుగోలు చేయడం మంచి ఆప్షన్‌. 8 ఇంచ్‌ల డిస్‌ప్లే, 5000 ఎంఎహెచ్‌ బ్యాటరీ అలాగే మీడియా టెక్‌ హెలియో ఎ22 ఎస్‌ఓసీపై పనిచేస్తుంది. వైర్లెస్‌ కీబోర్డ్‌

2లాగిటెక్‌ కె480 

రూ.2,594(అసలు ధర 2,995)

తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. వైర్లెస్‌ కీబోర్డ్‌ ఉన్నందున పట్టుకుని తీసుకువెళ్ళేందుకు చాలా బాగుంటుంది. ఆండ్రాయిడ్‌ టాబ్లెట్‌, ఐపాడ్స్‌, స్మార్ట్‌ ఫోన్లకు తగ్గదిగానే ఉంటుంది. వయా బ్లూటూత్‌ ఇది. దీన్ని ఒకేసారి మూడు డివైజెస్‌లకు కనెక్ట్‌ చేయవచ్చు.
టీవీ మానిటర్‌

ఎల్‌జీ 22 ఇంచ్‌ల ఐపీఎస్‌ మానిటర్‌

రూ.9,999 (అసలు ధర రూ.14,250)

ఇప్పటివరకు ల్యాప్‌టాప్‌, టాబ్లెట్‌ కొనుగోలు చేయకుండా కేవలం స్మార్ట్‌ఫోన్‌తో కాలక్షేపం చేస్తుంటే ఈ మానిటర్‌ను  తీసుకోవడం మంచిది. స్మార్ట్‌ ఫోన్‌ను ఈ మానిటర్‌కు స్ర్కీన్‌ మిర్రరింగ్‌ చేస్తే పెద్ద తెరపై క్లాసులు వినటానికి, చూడటానికి బాగుంటుంది. అంతే క్లారిటీతో పిక్చర్‌ కనిపిస్తుంది. 22 ఇంచ్‌ల ఫుల్‌ హెచ్‌డి రిజల్యూషన్‌ డిస్‌ప్లే, 1 వీజీఏ పోర్ట్‌, 1 హెచ్‌డీఎం1 పోర్ట్‌, 1 డీవీఐ పోర్ట్‌, 1 ఆడియో-ఔట్‌ పోర్ట్‌, 1 హెడ్‌ఫోన్‌  పోర్ట్‌ కనెక్టివిటీ ఆప్షన్స్‌ కూడా ఉన్నాయి. కలర్‌ ప్రింటర్‌

కేనన్‌ పిక్స్‌మా ఎంజీ2577ఎస్‌ ఆల్‌ఇన్‌ వన్‌ ఇంక్‌ జెట్‌

ధర రూ.3,299/-

ప్రింట్‌, స్కాన్‌, కాపీ అవసరాల కోసం ఈ ప్రింటర్‌ బాగా ఉపయోగపడుతుంది. నలుపు - తెలుపునకు తోడు కలర్‌ ప్రింటింగ్‌కూ పనికొస్తుంది. కూలింగ్‌ ప్యాడ్‌ జింక్‌ టెక్నాలజీస్‌

రూ.1,296(రూ.1.996)

నిరంతరం ల్యాప్‌టాప్‌ వాడుతుంటే అది వేడి ఎక్కి చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ల్యాప్‌టాప్‌నకు కూలింగ్‌ ప్యాడ్‌ అవసరం అవుతుంది. ఇక్కడ పేర్కొన్న కూలింగ్‌ ప్యాడ్‌ 15.6 నుంచి 17 ఇంచ్‌ల ల్యాప్‌టాప్‌లను ఇది సపోర్ట్‌ చేస్తుంది. డివైజెస్‌ కనెక్టింగ్‌ కోసం రెండు యూఎస్‌బీ పోర్టులు, డీప్‌ కూలింగ్‌కు అయిదు ఫ్యాన్లు ఉంటాయి. 
వైర్లెస్‌ రేంజ్‌ ఎక్స్‌టెండర్‌

టీపీ-లింక్‌ టీఎల్‌ డబ్ల్యూఏ85 ఓఆర్‌ఈ ఎన్‌300 ప్లస్‌ 

రూ.1.399(అసలు ధర రూ.2,999)

ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నప్పుడు ఇంటర్నెట్‌ కనెక్షన్‌లో అంతరాయం ఉండకూడదు. ఎక్కువ గాడ్జెట్స్‌ నెట్‌కు కనెక్ట్‌ చేసినా, కొంచెం దూరంలో ఉండి వీటిని వాడుకోవాలనుకున్నా ఇది అవసరం. మీ ఇంట్లో కొన్ని చోట్ల బ్యాండ్‌విడ్త్‌ ప్యాచ్‌లతో ఉంటే రేంజ్‌ ఎక్స్‌టెండర్‌ అవసరమవుతుంది. వైఫై డెడ్‌ జోన్లను తొలగించి రౌటర్‌తో నిరంతరంగా కనెక్టివిటీకి ఇది తోడ్పడుతుంది. ఇన్ఫినిటీ గ్లయిడ్‌ బై హర్మన్‌

రూ.1,499(అసలు ధర రూ.3,499)

హెడ్‌ ఫోన్స్‌ కోసం చూస్తుంటే ఈ కుషన్డ్‌ పరికరం బాగా ఉపయోగకరంగా ఉంటుంది. సింగిల్‌ చార్జ్‌తో ఇరవై గంటల సేపు వాడుకోవచ్చు. 


హెచ్‌డీ వెబ్‌కామ్‌

లాగిటెక్‌ సి270 

రూ.2,195(అసలు ధర రూ.2,595)

అన్ని లాప్‌టాప్‌లకు వెబ్‌కామ్‌ ఉంటోంది. అయితే నాణ్యతపైనే సందేహం. ఆఫీస్‌ మీటింగ్‌లు, విద్యార్థులకు క్లాసులకు అటెండ్‌ కావాలంటే ఇది బాగుంటుంది. ఈ విషయంలో మంచిది అంటే ఈ వెబ్‌కామ్‌ను చెప్పుకోవచ్చు. 720పి రిజల్యూషన్‌తో కాల్స్‌ చేసుకోవచ్చు. శబ్దాన్ని తగ్గించుకునే వీలు ఇన్‌బిల్ట్‌గానే ఇస్తున్నారు. వైర్లెస్‌ ఆప్టికల్‌ మౌస్‌

ఐబాల్‌ ఫ్రీగో జీ20 

రూ.428(అసలు ధర రూ.799)

ఇవాళ, రేపు వైర్డ్‌ మౌస్‌ కంటే వైర్లెస్‌నే ఎక్కువగా ప్రిఫర్‌ చేస్తున్నారు. దీనికి ఉండే సౌలభ్యం అలాంటిది. ఎర్గానమిక్‌ డిజైన్‌లో వస్తున్న ఇది పది మీటర్ల రేంజ్‌లో కనెక్టివిటీకి ఉపకరిస్తుంది. డెస్క్‌టాప్‌ సెటప్‌లో ఇది బాగుంటుంది. 

ఆల్‌ న్యూ ఎకో డాట్‌ (నాలుగో జనరేషన్‌)

రూ.3.799 (అసలు ధర రూ.4,499)

స్మార్ట్‌ స్పీకర్‌తో తీసుకెళ్ళేందుకు అనువుగా ఉంటుంది. హోమ్‌వర్క్‌గా ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు చెప్పేందుకు, ఆన్‌లైన్‌ క్లాసుల్లో బ్రేక్‌ పోస్ట్‌ కోసం ఉపయోగపడుతుంది. బ్లూ, బ్లాక్‌, వైట్‌ కలర్‌ ఆప్షన్స్‌లో దొరుకుతోంది. నాలుగు మైక్రోఫోన్లను ఉంచుకోవచ్చు.