Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘పోస్టల్‌’ను వినియోగించుకోవాలి

భూదాన్‌పోచంపల్లి, డిసెంబరు 4: భూదాన్‌పోచంపల్లి పట్టుచీరల దుకాణదారుల కు పోస్టల్‌ శాఖ అందిస్తున్న విలువైన సేవలను సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్‌ పోస్టల్‌ శాఖ పార్సిల్‌ విభాగం మేనేజర్‌ సదానందం అన్నారు. భూదాన్‌పోచంపల్లిలోని చేనేత టైఅండ్‌డై అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వస్త్ర వ్యాపారులకు పోస్టల్‌ శాఖ ఆధ్వర్యం లో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత వస్త్ర వ్యాపారులు తమ ఎగుమతులను దేశంలో ఎక్కడికైనా పంపేలా పోస్టల్‌ శాఖ విస్తృతస్థాయి సేవలు అందిస్తోందన్నారు. ప్రైవేటు కొరియర్‌ ద్వారా వ్యాపారులకు తమ ఎగుమతులకు భద్రత ఉండదని, అదే తమ శాఖ ద్వారా వస్తువులకు బీమా సౌకర్యం కూడా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టైఅండ్‌డై అసోసియేషన్‌ అధ్యక్షుడు తడక రమేష్‌, ప్రధాన కార్యదర్శి భారత లవకుమార్‌, ఉపాధ్యక్షుడు సంగెం చంద్రయ్య, కోశాధికారి బోగ విష్ణు, పోస్టల్‌ అధికారులు సతీష్‌, రాజేష్‌, అసోసియేషన్‌ సభ్యులు మంగళపల్లి రమేష్‌, గంజి యుగంధర్‌, కర్నాటి బాలరాజు, కర్నాటి నరసింహ, వనం శంకర్‌, భారత ఆంజనేయులు, ఈపూరి ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement